KIA Exports: ఎగుమతుల్లో కియా ఇండియా రికార్డు.. ఏకంగా లక్ష యూనిట్ల ఎగుమతి

|

Nov 27, 2024 | 2:44 PM

భారతదేశాన్ని తయారీ రంగంలో బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పీఎల్ఐ స్కీమ్స్‌లో భాగంగా కంపెనీలకు రాయితీలను అందిస్తుంది. అలా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఏర్పాటు కియా కార్ల కంపెనీ ఎగుమతుల్లో నయా రికార్డు సృష్టించింది. కంప్లీట్లీ నాక్ డౌన్(సీకేడీ)లను ఏకంగా లక్ష యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో కియా ఎగుమతుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

KIA Exports: ఎగుమతుల్లో కియా ఇండియా రికార్డు.. ఏకంగా లక్ష యూనిట్ల ఎగుమతి
Kia Exports
Follow us on

కియా ఇండియా అనంతపురం జూన్ 2020లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100,000 కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (సీకేడీ) వాహనాలను ఎగుమతి చేయడం ద్వారా అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. కియా చర్యలతో వాహన ఎగుమతులలో భారతదేశాన్ని కీలక కేంద్రంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.   కియా కార్పొరేషన్‌కు సంబంధించిన గ్లోబల్ ఎగుమతి వ్యూహంలో కియా ఇండియా కీలకమైన భాగంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సీకేడీ ఎగుమతుల్లో 50 శాతం వాటాను కియా కలిగి ఉంది. కియా కంపెనీ 2024లో ఉజ్బెకిస్తాన్, ఈక్వెడార్, వియత్నాం వంటి మార్కెట్‌లకు 38,000 కంటే ఎక్కువ సీకేడీ యూనిట్లను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంది.

ప్రపంచ వినియోగదారులకు ఉత్పాదకత, ఆవిష్కరణలు, విలువను అందించడంలో కియా ఇండియాకు సంబంధించిన నిబద్ధతను అర్థం చేసుకోవచ్చని కియాలోని చీఫ్ సేల్స్ ఆఫీసర్ జున్సు చో అన్నారు. సెల్టోస్, సోనెట్, కారెన్స్ వంటి మోడల్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లలో పటిష్టమైన పనితీరును కనబరుస్తున్నందుకు గర్విస్తున్నామని పేర్కొన్నారు. గ్లోబల్ ఆటోమోటివ్ వాల్యూ చైన్‌లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఎగుమతి అనుకూల విధానాలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. 

2030 నాటికి ఎగుమతి పరిమాణాన్ని రెట్టింపు చేయడానికి మధ్యప్రాచాత్య దేశాలతో పాటు ఆఫ్రికాకు సీకేడీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కియాలోని చీఫ్ సేల్స్ ఆఫీసర్ జున్సు చో తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 3.67 లక్షల యూనిట్లను ఎగుమతి చేయడంతో కియా ఇండియాకు సంబంధించిన ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తున్నట్లు వివరించారు. కియా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌లో ఉన్న అధిక నాణ్యత వాహనాలను పంపిణీ చేస్తూ ప్రపంచ వినియోగదారులకు సంబంధించిన విభిన్న అవసరాలను తీరుస్తూనే ఉన్నాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి