మత్స్యకారులకు గమనిక.. ఈ కార్డుని ఉపయోగిస్తున్నారా..! వివరాలు తెలుసుకోండి..

Fishermen:మత్స్య కార్మికుల అవసరాలు తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ఉపయోగపడుతుందని పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని

మత్స్యకారులకు గమనిక.. ఈ కార్డుని ఉపయోగిస్తున్నారా..!  వివరాలు తెలుసుకోండి..
Fisheries
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 25, 2021 | 6:55 AM

Fishermen:మత్స్య కార్మికుల అవసరాలు తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ఉపయోగపడుతుందని పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫిషరీస్ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్తం కేసీసీ కార్డుని వారికి వర్తింపజేసిందన్నారు. దీనిపై అవగాహన కల్సించడానికి ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వెబ్‌నార్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మత్స్యశాఖ (DoF) కార్యదర్శి జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షత వహించగా 400 మందికి పైగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వైన్ మత్స్య రంగం నేపథ్యం, వైవిధ్యాన్ని గురించి తెలిపారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు మత్స్యకార్మికులకు ఒక వరంలాంటిదని వారి క్యాపిటల్‌ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్మికులందరికి సులువుగా రుణాలు అందించడమే ఈ కార్డ్‌ లక్ష్యమని చెప్పారు. అర్హులైన మత్స్యకారులు ఈ కార్డుని ఉపయోగిస్తున్నారా లేదా అనేది రాష్ట్ర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను కోరారు. అలాగే ఏదైనా అడ్డంకి ఉన్నట్లయితే వాటిని తొలగించడానికి సంబంధిత బ్యాంకులను సంప్రదించి KCC ఆమోదం లభించేలా చూడాలన్నారు.

ఈ ప్రచారాన్ని 15 నవంబర్ 2021 నుంచి 15 ఫిబ్రవరి 2022 వరకు నిర్వహిస్తున్నట్లు స్వైన్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ (ఇన్ ల్యాండ్ ఫిషరీస్) సాగర్ మెహ్రా మాట్లాడుతూ.. భారతదేశంలో ఆక్వాకల్చర్, మత్స్య సంపదను ప్రోత్సహించడానికి, విస్తరించడానికి డిపార్ట్‌మెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. చేపల పెంపకందారులు, మత్స్యకారుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికే KCC సౌకర్యాన్ని విస్తరించామని తెలిపారు. అనంతరం కేసీసీ కార్డుపై ఉన్న సందేహాల గురించి కార్మికులకు వివరించే ప్రయత్నం చేశారు.

ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు

RBI: ఆ బ్యాంకుపై ఆర్బీఐ 30 లక్షల జరిమానా.. రెండు సహకార బ్యాంకులపై చర్యలు.. ఎందుకంటే..?

80 దేశాల్లో 1512 స్క్రీన్‌లలో విడుదలైన 83 చిత్రం.. భారీ వసూళ్ల దిశగా పరుగులు..

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!