Kaynes Technology IPO: ఐపీఓ తీసుకురానున్న కేన్స్​ టెక్నాలజీ.. రూ.650 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడి..

| Edited By: Srinivas Chekkilla

Apr 16, 2022 | 7:35 PM

ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టార్‌ కంపెనీ అయిన కేన్స్ టెక్నాలజీ(Kaynes Technology), ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా ఫైనాన్స్ సమీకరణ కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి పత్రాలను దాఖలు చేసింది...

Kaynes Technology IPO: ఐపీఓ తీసుకురానున్న కేన్స్​ టెక్నాలజీ.. రూ.650 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడి..
Ipo
Follow us on

ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టార్‌ కంపెనీ అయిన కేన్స్ టెక్నాలజీ(Kaynes Technology), ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా ఫైనాన్స్ సమీకరణ కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DHRP) ప్రకారం, IPOలో రూ. 650 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నారు. OFS కింద, ప్రమోటర్ రమేష్ కున్హికన్నన్ 37 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయగా, షేర్ హోల్డర్ ఫ్రెంజీ ఫిరోజ్ 35 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు.

ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు రూ.130 కోట్లను రుణాన్ని తిరిగి చెల్లించేందుకు, రూ.98.93 కోట్లను మైసూరు, మనేసర్‌లోని తయారీ కేంద్రాలకు మూలధన వ్యయానికి వినియోగించనున్నారు. అదే సమయంలో, కంపెనీ అనుబంధ యూనిట్ అయిన కేన్స్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.140.30 కోట్లు ఉపయోగించనున్నారు.

అటు ఆభరణాల రిటైలర్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 525 కోట్లను సమీకరించడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి ఇప్పటికే అనుమతి కోరింది. సెన్కో గోల్డ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి IPOకి సంబంధించిన ప్రాథమిక పత్రాలను సమర్పించింది. దీని ప్రకారం, ఇది రూ. 325 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది, అలాగే ప్రస్తుత వాటాదారు SAIF పార్టనర్స్ ఇండియా వద్ద ఉన్న రూ. 200 కోట్ల షేర్లను విక్రయిస్తుంది.

Read Also.. Stock Market: దాదాపు 2 శాతం పడిపోయిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఐటీ, టెలికాం సెక్టార్​లో భారీ క్షీణత..