Jobs Hiring: భారత్‌లో భారీగా పెరిగిన ఉద్యోగ నియమాకాలు.. ఆ రంగంలోనే కొత్త ఉద్యోగాలు అధికం

|

Dec 11, 2024 | 2:06 PM

‘ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే’లో సంచలన విషయాలు బయటపడ్డాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే నియమాకాలు బాగా పెరుగుతాయని మానవ వనరుల సేవల సంస్థ నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఐటీ రంగంలోనే కొత్త ఉద్యోగాలు అధికంగా ఉన్నట్లు వెల్లడైయ్యాయి.

Jobs Hiring: భారత్‌లో భారీగా పెరిగిన ఉద్యోగ నియమాకాలు.. ఆ రంగంలోనే కొత్త ఉద్యోగాలు అధికం
It Jobs
Follow us on

జనవరి-మార్చి 2025 క్వార్టర్‌లో భారతదేశంలో నియామకాల సెంటిమెంట్ మునుపటి క్వార్టర్‌, గత సంవత్సరంతో పోలిస్తే మూడు శాతం పాయింట్లు పెరిగింది. దేశం ప్రపంచ సగటు 25% కంటే 15 పాయింట్లు, యునైటెడ్ స్టేట్స్ కోస్టా కంటే ముందుంది. తాజా మ్యాన్‌పవర్‌గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే ప్రకారం ఈ విషయాలు వెల్లడైయ్యాయి.

సర్వే చేసిన 3,150 మంది భారతీయ యజమానులలో 53% మంది తమ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించాలని యోచిస్తున్నారు. అయితే 13% మంది నియామకం తగ్గుతుందని లేదా బ్యాక్‌ఫిల్ చేయడానికి ప్రణాళికలు లేవని భావిస్తున్నారు. 50% నికర ఉపాధి ఔట్‌లుక్ (NEO)తో, ఫైనాన్షియల్స్ & రియల్ ఎస్టేట్ (44%)తో IT రంగం ఎప్పటిలానే బలంగా ఉంది. కన్స్యూమర్ గూడ్స్ & సర్వీసెస్ (40%), ఎనర్జీ & యుటిలిటీస్ (38%), హెల్త్‌కేర్ &లైఫ్ సైన్సెస్ (38%) కూడా అగ్ర రంగాలలో ర్యాంక్ పొందాయి.

ఈ సందర్భంగా మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా కంట్రీ మేనేజర్ సందీప్ గులాటి  మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందన్నారు. జనవరి-మార్చి 2025 నాటికి భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన తెలిపారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పబ్లిక్ ఫండింగ్‌తో పాటుగా, IT రంగ ఉపాధి మార్కెట్‌కు ప్రయోజనం చేకూర్చయని ఆయన చెప్పారు. ఫలితంగా ఈ రంగం 50% ఔట్‌లుక్‌తో ముందుందన్నారు. తమ ఆపరేషన్ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్న పెద్ద సంస్థలు పెట్టే పెట్టుబడులు భారతదేశానికి ప్రయోజనం చేకూర్చేలా కనిపిస్తున్నాయన్నారు.

వెస్ట్ ఇండియా 43% ఔట్‌లుక్‌తో ముందంజలో ఉంది. మునుపటి క్వార్టర్‌తో పోలిస్తే నాలుగు పాయింట్లు పెరిగి, తూర్పు భారతదేశం 41% వద్ద ఉంది. 11 పాయింట్ల పెరిగింది. ఉత్తరం (39%) స్వల్పి పాయింట్లు తగ్గింది. దక్షిణ (38%) మూడు పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. 5,000+ ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థలు 48% వద్ద అత్యధిక ఔట్‌లుక్‌లను నివేదించడంతో పెద్ద సంస్థలు నియామకంలో పైచేయి సాధించాయి. పరిశ్రమలలో పెరుగుతున్న లింగ సమానత్వ ప్రయత్నాలను కూడా సర్వే హైలైట్ చేసింది. దాదాపు 66% సంస్థలు పే ఈక్విటీ కార్యక్రమాలతో ట్రాక్‌లో ఉన్నాయని నివేదించాయి. గత సంవత్సరం కంటే 8 శాతం పాయింట్ల మెరుగుదల కనిపించింది. IT రంగం 78%తో ముందుంది, ఫైనాన్షియల్స్ & రియల్ ఎస్టేట్ (69%), కన్స్యూమర్ గూడ్స్ & సర్వీసెస్ (67%), హెల్త్‌కేర్ & లైఫ్ సైన్సెస్ (66%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి