Jio Phone 5G: భారత దేశంలో రిలయన్స్ జియో (Reliance Jio) దూసుకుపోతోంది. నెట్‌వర్క్ విషయంలో ముందడుగు వేస్తోంది. దేశంలో త్వరగా 5G సేవలు అందించే ప్రయత్నాలు ముమ్మరం చేయడమే కాకుండా జియో 5g స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంవత్సరంలో 5జీ నెట్‌వర్క్ (5G Network) దూసుకుపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రముఖ టెలికం కంపెనీలు ఈ ఏడాదిలో 5జీ సేవలు (5G Service) ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 5జీ నెట్‌వర్క్ ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోన్న జియో 5G ఫోన్ కూడా తీసుకురానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫిచర్స్ వివరాలు లీకయ్యాయి.
జియోఫోన్ 5జీ లీకైన స్పెసిఫికేషన్స్:
నివేదికల ప్రకారం.. ఈ జియో ఫోన్ భారతదేశంలో రూ.9000 నుంచి రూ.12,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే రూ.10వేల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ జియో ఫోన్ 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే, పరికరం 1,600 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో ఉండే అవకాశం ఉంది. అలాగే 4జీబీ ర్యామ్ (4GB Ram), 32 ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో ఉండనున్నట్లు సమాచారం. ఇందులో ఆండ్రాయిడ్ 11 (Android 11) ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఉండనుంది. కెమెరా విషయానికొస్తే.. ప్రధాన కెమెరా 13ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ 5000ఎంఏహెచ్, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లు విడుదల అవుతుందనే విషయం క్లారిటీ లేదు. కానీ..ఈ ఏడాది చివర్‌లో విడులయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు భావిస్తు్న్నారు.
ఇవి కూడా చదవండి: