Wipro: ఆ పని చేస్తూ దొరికిపోయిన విప్రో ఉద్యోగులు.. ఏకంగా 300 మందిని తొలగించిన టెక్‌ దిగ్గజం..

|

Sep 22, 2022 | 9:01 AM

Wipro: ఏమంటూ కరోనా (Corona) మహమ్మారి వెలుగులోకి వచ్చిందో అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) విధానాన్ని అన్ని కంపెనీలు అమలు చేయాల్సిన పరిస్థితి..

Wipro: ఆ పని చేస్తూ దొరికిపోయిన విప్రో ఉద్యోగులు.. ఏకంగా 300 మందిని తొలగించిన టెక్‌ దిగ్గజం..
Wipro Employees
Follow us on

Wipro: ఏమంటూ కరోనా (Corona) మహమ్మారి వెలుగులోకి వచ్చిందో అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) విధానాన్ని అన్ని కంపెనీలు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటును కల్పించాయి. అయితే అందరికీ శత్రువుగా మారిన కరోనా కొందరు ఐటీ ఎంప్లాయిస్‌కి మాత్రం వరంలా మారింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మరో సంస్థలో ఫుల్‌ టైమ్‌ పనిలో చేరారు. ఇలా రెండు కంపెనీల్లో జీతాలు తీసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

దీనినే మూన్‌లైటింగ్ (Moon Lighting) ప్రక్రియగా అభి వర్ణిస్తున్నారు. ఒకేసారి రెండు సంస్థల్లో పనిచేయడం అనైతికమని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చాలా కంపెనీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చర్యలకు ప్రముఖ టెక్‌ దిగ్గజం విప్రో తెర తీసింది. తమ కంపెనీలో పనిచేస్తూ.. ప్రత్యర్థి సంస్థలకూ ప్రత్యక్షంగా పనిచేస్తున్న వారిపై విప్రో వేటు వేసింది. ఇలా ఏకంగా 300 మందిని తొలగిస్తు నిర్ణయం తీసుకుంది.

ఈ విషయమై అజీమ్‌ ప్రేమ్‌జీ తనయుడు విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. ‘విప్రో ఉద్యోగుల్లో కొందరు పోటీ సంస్థలకూ ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల్లో ఇలా పనిచేస్తున్న 300 మందిని గుర్తించాం. వీరిని విధుల నుంచి తొలగించాం. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం మోసంతో సమానమన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని’ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..