
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాన్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇప్పటికే బలహీనపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, తాజా యుద్ధ పరిణామాలతో మరింత దిగజారింది. స్థానిక కరెన్సీ ‘రియాల్’ విలువ పతనం కావడంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల సామాన్య పౌరులు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అక్కడి మార్కెట్లలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం..
ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
బియ్యం: అక్కడ ఒక కిలో బియ్యం ధర భారతీయ కరెన్సీలో సుమారు రూ. 600 నుంచి రూ. 800 వరకు పలుకుతోంది.
మాంసం: మాంసం ధరలు కిలోకు రూ. 4000 దాటిపోయాయి, ఇది మధ్యతరగతి కుటుంబాలకు తీరని భారంగా మారింది.
ఇతర వస్తువులు: పాలు, గుడ్లు, కూరగాయల ధరలు కూడా గత కొన్ని వారాల్లో రెట్టింపు అయ్యాయి. హోటళ్లు, తినుబండారాల కేంద్రాల్లో ధరలు పెరగడంతో జనం బయట తినడమే మానేస్తున్నారు.
ధరల పెరుగుదల వల్ల ఇరాన్ ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గింది. ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కేవలం ఆహారం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. నిరుద్యోగం పెరగడం, జీతాలు పెరగకపోవడం, ధరలు ఆకాశాన్ని తాకడంతో మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి జారుకుంటున్నారు. యుద్ధం వల్ల ప్రజలు వస్తువులను నిల్వ చేసుకోవడం కూడా కొరతకు, తద్వారా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. కాగా, యుద్ధం ఏ దేశానికైనా విధ్వంసాన్నే మిగుల్చుతుంది అనడానికి ఇరాన్ ప్రస్తుత పరిస్థితి ఒక నిదర్శనం. ఆయుధాల మోత కన్నా ఆకలి కేకలు అక్కడ భయంకరంగా వినిపిస్తున్నాయి.
ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..