Insurance Policy: పెరగనున్న ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియంలు.. కారణం ఏంటంటే..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బీమా తీసుకుంటున్నారు. కరోనా తర్వాత ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునే వారికి సంఖ్య పెరిగిపోయింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో పాటు వివిధ రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రీమియంల కంటే రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Insurance Policy: పెరగనున్న ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియంలు.. కారణం ఏంటంటే..!
Insurance Policy

Updated on: May 10, 2023 | 11:30 AM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బీమా తీసుకుంటున్నారు. కరోనా తర్వాత ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునే వారికి సంఖ్య పెరిగిపోయింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో పాటు వివిధ రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రీమియంల కంటే రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీమా పాలసీల ప్రీమియంలు 10% వరకు పెరుగుతాయనే ఆందోళనలు ఉన్నాయి. ఆరోగ్యం, మోటార్, ఆస్తి ఇతర రకాల బీమా పాలసీల ప్రీమియంలు పెరగవచ్చు. రానున్న కాలంలో సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం మరింత పెరగవచ్చు నిపుణులు చెబుతున్నారు. అటువంటి పాలసీల ఇన్సూరెన్స్ ప్రీమియంలు 10% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా గ్లోబల్ రీఇన్స్యూరెన్స్ కంపెనీలు గణనీయమైన నష్టాలను చవిచూశాయి. దీంతో ఈ కంపెనీలు తమ రేట్లను 40 నుంచి 60% పెంచాయి.

రీఇన్స్యూరెన్స్ రేట్ల పెరుగుదల కారణంగా, భారతదేశంలో హెల్త్, ఆటో, ప్రాపర్టీ పాలసీల ప్రీమియంలు 10% వరకు పెరుగుతాయనే ఆందోళనలు ఉన్నాయి. దీనర్థం మీరు ముందుగా 10,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తే, మీరు ఇకపై 11,000 రూపాయలు చెల్లించవలసి రావచ్చు. బీమా కంపెనీలు రీ-ఇన్సూరెన్స్ కంపెనీలతో బీమాను కొనుగోలు చేయడం ద్వారా తమ నష్టాన్ని కవర్ చేస్తాయి. రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంలను పెంచడంతో, సాధారణ బీమా కంపెనీలు ప్రజానీకానికి ఇచ్చే పాలసీల ప్రీమియంలను పెంచవచ్చు. దీంతో ఇన్సూరెన్స్‌ సంస్థలు ప్రీమియంలలో 10 శాతం వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా సాధారణ బీమా పాలసీలు మరింత ఖరీదైనవి కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us