Vande Bharat Sleeper: అందుబాటులోకి రానున్న వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు.. అద్భుతమైన ఫీచర్స్‌

|

Mar 10, 2024 | 8:04 AM

రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులు కొత్త వందే భారత్ రైలు బహుమతిని ఇవ్వబోతుంది మోడీ ప్రభుత్వం. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు సెమీ హై స్పీడ్ సిరీస్ వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని బెంగళూరులో ప్రత్యేక స్లీపర్ కోచ్‌లను సిద్ధం చేస్తున్నారు. బీఈఎంఎల్‌..

Vande Bharat Sleeper: అందుబాటులోకి రానున్న వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు.. అద్భుతమైన ఫీచర్స్‌
Vande Bharat Sleeper
Follow us on

రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులు కొత్త వందే భారత్ రైలు బహుమతిని ఇవ్వబోతుంది మోడీ ప్రభుత్వం. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు సెమీ హై స్పీడ్ సిరీస్ వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని బెంగళూరులో ప్రత్యేక స్లీపర్ కోచ్‌లను సిద్ధం చేస్తున్నారు. బీఈఎంఎల్‌ రూపొందించిన వందే భారత్‌ స్లీపర్‌ ప్రోటోటైప్‌ ట్రైన్‌ కార్‌ బాడీ నిర్మాణాన్ని శనివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వందేభారత్ స్లీపర్ రైలును 6 నెలల్లో నడపాలన్నారు.

కొత్త తరహాలో కోచ్‌లను రూపొందిస్తున్నాం..

వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత నమో-భారత్ (రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్), అమృత్ భారత్ రైలు (పుష్-పుల్ ట్రైన్ టెక్నాలజీ) ప్రారంభించామని చెప్పారు. దేశంలో వందే భారత్ స్లీపర్, వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువచ్చే పని వేగంగా జరుగుతోంది. దీని కోచ్‌ల నిర్మాణం, పైకప్పును కొత్త పద్ధతిలో డిజైన్ చేస్తున్నారు. ఫర్నిషింగ్ కూడా త్వరలో ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుంది?

కొత్త స్లీపర్ రైలు విశేషాలను రైల్వే మంత్రి వైష్ణవ్ వివరించారు. వందేభారత్ కోచ్‌లలో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ), వైరస్ నియంత్రణ వ్యవస్థ, తగ్గిన షాక్, నాయిస్, వైబ్రేషన్, స్లీపర్ బెర్త్‌లు, ఎక్స్‌టీరియర్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయని ఆయన చెప్పారు. అమృత్ భారత్ రైలుతో పాటు మొత్తం మూడు వందే భారత్ రైళ్లకు ప్రయాణీకులు, ఉద్యోగుల సలహాపై నిరంతరం మార్పులు చేయనున్నారు.

బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మధ్య నడుస్తున్న అమృత్ భారత్ రైలుకు మంచి స్పందన వచ్చిందని, ఇందులో 100 శాతం సీట్లు నిండిపోయాయని ఆయన అన్నారు. ప్రస్తుతం రైల్వేశాఖ అదనంగా 100 అమృత్ భారత్ రైళ్లను సిద్ధం చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) 16 కార్ల వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలు సెట్‌ల 10 రేక్‌ల రూపకల్పన, తయారీ, కమీషన్ కోసం మే 2023లో BEML లిమిటెడ్‌తో ఆర్డర్ చేసింది.

వందే భారత్ స్లీపర్ వెర్షన్ ఫీచర్లు?

– కొత్త వందే భారత్ రైళ్లలో మొదటి ఏసీ ప్రయాణికులకు వేడి నీటి స్నానం, రైలు డ్రైవింగ్ సిబ్బందికి టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఒక్కో రైలులో కోచ్‌ల సంఖ్య 16 ఉంటుంది. దీని గరిష్ట వేగం 160 kmph.

– దీని కోచ్‌లలో ఇంటీరియర్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సెక్యూరిటీ, వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్, సెన్సార్ ఆధారిత ఇంటర్‌కమ్యూనికేషన్ గేట్, ఆధునిక టాయిలెట్, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, కనిపించే సమాచారంతో కూడిన స్టీల్ బాడీ ఉంటుంది.

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి