Indian Railways: రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటి?

Indian Railways: రైల్వే ట్రాక్స్‌పై కనిపించే FM మార్క్ గల తెల్లటి కాంక్రీట్ దిమ్మెలు రైళ్ల భద్రతకు అత్యవసరం. ఫౌలింగ్ మార్క్ అంటే రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా ఆపే ఒక భద్రతా హద్దు. లూప్ లైన్‌లో ఆగే రైళ్లు ఈ మార్క్‌ను దాటకుండా చూసుకోవడం ద్వారా ప్రమాదాలను సమర్థవంతంగా నివారిస్తారు.

Indian Railways: రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటి?
Train Tracks

Updated on: Feb 11, 2026 | 7:47 AM

Indian Railways: మీరు రైలు పట్టాలను చూసే ఉంటారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు, ట్రాక్‌లను చూసినప్పుడు కొన్ని విషయాలను మీరు గమనించకపోవచ్చు. ఎందుకంటే రైలు పట్టాలపై ప్రయాణాలంటే ఎంతో సాంకేతికత ఉంటుంది. అయితే రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ మారే ప్రదేశంలో రెండు ట్రాక్‌ల మధ్య ఓ తెల్లటి దిమ్మె ఉంటుంది. మరి అది ఎందుకు ఉంటుందా? దాని ఉపయోగం ఏంటో తెలుసుకుందాం..

రైల్వే ట్రాక్స్‌పై ప్రయాణిస్తున్నప్పుడు, రెండు పట్టాల మధ్య తెల్లటి కాంక్రీట్ దిమ్మెలు, వాటిపై నలుపు రంగులో FM అని రాసి ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ FM అంటే ఫౌలింగ్ మార్క్. ఇది రైల్వే స్టేషన్లలో రెండు ట్రైన్ ట్రాక్స్ ఒకదానికొకటి కలిసే లేదా విడిపోయే చోట ఉంటుంది.

ఈ ఫౌలింగ్ మార్క్ ముఖ్య ఉద్దేశ్యం రైల్వే భద్రతను నిర్ధారించడం. రైలు ఇంజిన్లు లేదా బోగీలు సాధారణంగా పట్టాల కంటే కొంత వెడల్పుగా ఉంటాయి. ఒక రైలు లూప్ లైన్లోకి వచ్చి ఆగినప్పుడు, అది ఈ ఫౌలింగ్ మార్క్‌ను దాటి ఆగితే, పక్కన ఉన్న మెయిన్ లైన్లో వచ్చే మరో రైలు ఆగి ఉన్న రైలు వెనుక భాగాన్ని ఢీకొనే అవకాశం ఉంటుంది.

లోకో పైలట్లు, గార్డులకు తమ రైలు సురక్షితమైన దూరంలో ఆగిందా లేదా అని తెలియజేయడానికి ఈ రాయి ఒక సూచనగా పనిచేస్తుంది. ప్రమాదాలు జరగకుండా నివారించడానికి రైలు ఆగినప్పుడు చివరి బోగీ, ఇంజిన్ ఖచ్చితంగా ఈ మార్క్ లోపలే ఉండేలా చూసుకుంటారు. సరళంగా చెప్పాలంటే ఫౌలింగ్ మార్క్ అనేది రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నివారించే ఒక ముఖ్యమైన భద్రతా హద్దు.

ఇది కూడా చదవండి: Gold Price Today: పెరిగిన బంగారం, తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us