Mukesh Ambani: అంబానీ రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే సంపద తరిగిపోవడానికి ఏన్నేళ్లు పడుతుంది?

Mukesh Ambani: ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఈ సంస్థ దాదాపు USD 125 బిలియన్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్ పెట్రోకెమికల్స్, చమురు మరియు గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది..

Mukesh Ambani: అంబానీ రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే సంపద తరిగిపోవడానికి ఏన్నేళ్లు పడుతుంది?

Updated on: Dec 02, 2025 | 3:31 PM

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద గణాంకాలు తరచుగా వార్తల్లో నిలుస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఈ గణాంకాలను లోతుగా పరిశీలించడానికి ప్రయత్నించారా? అంబానీ గురించి ఏ విషయాలు అయినా ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రపంచంలోని 16వ ధనవంతుడు. అలాగే భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ముఖేష్ అంబానీ నికర విలువ గురించి గురించి మీకు తెలుసా? అతని మొత్తం సంపద $113.5 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 10.14 లక్షల కోట్లు)గా అంచనా. ఈ మొత్తం చాలా పెద్దది. ఒక వ్యక్తి సగటున దానిని లెక్కించడం ప్రారంభిస్తే అది జీవితకాలం పడుతుంది. ముఖేష్ అంబానీ ఒక్క పైసా కూడా సంపాదించకుండా ఇప్పుడున్న సంపదను ఖర్చు చేయడం ప్రారంభిస్తే డబ్బు ఎంతకాలం ఉంటుంది?

ముఖేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ రూ.1,01,40,00,00,00,00,000 (₹10.14 లక్షల కోట్లు). అతను ప్రతిరోజూ రూ. 5 కోట్లు ఖర్చు చేస్తే అతని మొత్తం సంపద ఎంతకాలం అయిపోతుందో తెలుసుకుందాం. ఈ విధంగా ఖర్చు చేస్తే అతని సంపదను ఖాళీ కావడానికి 202,800 రోజులు పడుతుంది. 202,800 రోజులను 365తో భాగిస్తే 555 సంవత్సరాలు అవుతాయి. ఇప్పటి నుండి ముఖేష్ అంబానీ ప్రతిరోజూ రూ.5 కోట్లు ఖర్చు చేసినా, అతని ఖజానా ఖాళీ కావడానికి ఇంకా ఐదు శతాబ్దాలు పడుతుంది. దీని అర్థం అతని భవిష్యత్ తరాలలో చాలామంది ఎటువంటి పని చేయకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు.

ఇది కూడా చదవండి: Bank Account: మీరు బ్యాంకు అకౌంట్‌ మూసివేస్తున్నారా? ఈ 3 తప్పులు అస్సలు చేయకండి.. నష్టపోతారు!

నూలు వ్యాపారి నుండి 10 లక్షల కోట్ల సామ్రాజ్యంగా

ఈ అపారమైన సంపద రాత్రికి రాత్రే ఏర్పడింది కాదు. ఇది సుదీర్ఘ పోరాటం. నేడు $125 బిలియన్ల ఆదాయ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను 1966లో ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ స్థాపించారు. ఆ సమయంలో అతను ఒక చిన్న వస్త్ర తయారీదారు, నూలు వ్యాపారి.

రిలయన్స్ ఎంత ఆదాయం సంపాదిస్తుంది?

ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఈ సంస్థ దాదాపు USD 125 బిలియన్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్ పెట్రోకెమికల్స్, చమురు మరియు గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీని అతని తండ్రి ధీరూభాయ్ అంబానీ ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభించారు. ధీరూభాయ్ తన కెరీర్‌ను నూలు వ్యాపారిగా ప్రారంభించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత ముఖేష్ అంబానీ, అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు. తర్వాత ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: LPG Gas: మీ ఇంట్లో ఎల్‌పీజీ కనెక్షన్ ఉందా? ఎవ్వరు చెప్పని సీక్రెట్‌ గురించి తెలుసుకోండి.. ఎంతో బెనిఫిట్‌!

రిలయన్స్ టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ విభాగం జియోకు 500 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2026లో జియోను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని యోచిస్తున్నట్లు ముఖేష్ అంబానీ చెప్పారు. 2023లో రిలయన్స్ ఇప్పటికే దాని ఆర్థిక విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను లిస్ట్ చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి