Hyundai Inster EV: హ్యూందాయ్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ రెడీ.. విడుదల చేసిన పిక్స్‌ చూస్తే పీక్స్‌..

నెలాఖరులో జరిగే బుసాన్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో హ్యూందాయ్‌ కొత్త కారు ఇన్‌స్టర్‌ ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం, 'ఇన్‌స్టర్‌' అనే పదం 'ఇంటిమేట్ అండ్‌ ఇన్నోవేటివ్' నుంచి ఉద్భవించింది. కార్‌ మేకర్‌ ఈ ఎస్‌యూవీకి సంబంధించిన సెట్‌ టీజర్‌ చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ నేపథ్యంలో కారు లుక్‌, డిజైన్‌, స్పెసిఫికేషన్ల వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Hyundai Inster EV: హ్యూందాయ్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ రెడీ.. విడుదల చేసిన పిక్స్‌ చూస్తే పీక్స్‌..
Hyundai Inster Ev

Updated on: Jun 14, 2024 | 2:35 PM

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌కు మన దేశంలో కూడా మంచి డిమాండ్‌ ఉంది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు ఆ కంపెనీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. కేవలం పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు మాత్రమే కాక, హ్యూందాయ్‌ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌పై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మరో కొత్త ఎలక్ట్రిక్‌ కారును భారతీయ మార్కెట్లోకి లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నెలాఖరులో జరిగే బుసాన్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో హ్యూందాయ్‌ కొత్త కారు ఇన్‌స్టర్‌ ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం, ‘ఇన్‌స్టర్‌’ అనే పదం ‘ఇంటిమేట్ అండ్‌ ఇన్నోవేటివ్’ నుంచి ఉద్భవించింది. కార్‌ మేకర్‌ ఈ ఎస్‌యూవీకి సంబంధించిన సెట్‌ టీజర్‌ చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ నేపథ్యంలో కారు లుక్‌, డిజైన్‌, స్పెసిఫికేషన్ల వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హ్యుందాయ్ ఇన్‌స్టర్‌: డిజైన్

ఇన్‌స్టర్‌ ఈవీ డిజైన్‌ను పరిశీలస్తే.. ఇప్పటికే ఉన్న కాస్పర్‌ ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌లైట్లు, ఆధునిక పిక్సలేటెడ్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి. వెనుకవైపు, ఇది ఒకే విధమైన పిక్సెల్- టెయిల్ లైట్లను కలిగి ఉంది. టీజర్ ఇమేజెస్‌ని బట్టి ముందు భాగంలో మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్‌ ఉంటుంది.

హ్యుందాయ్ ఇన్‌స్టర్‌: రేంజ్

ఈ కొత్త ఎస్‌యూవీ బ్యాటరీ పరిమాణం, స్పెక్స్ గురించి హ్యుందాయ్ ఇంకా వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ వాహనం ఒక్కసారి చార్జ్ చేస్తే 355 కిమీల రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనిని ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని కార్లతో పోల్చి చూస్తే, టాటా పంచ్ఈవీ 315 కిమీ, 421 కిమీ మధ్య రేంజ్‌తో తో రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఇన్‌స్టర్‌: ధర

భారతదేశంలో ఇన్‌స్టర్‌ ఈవీ లాంచ్ అనిశ్చితంగానే ఉంది. అయితే, ఈ మోడల్ భారతీయ మార్కెట్లోకి వస్తే, దాని ధర రూ. 11.5 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండవచ్చు. ఇది టాటా పంచ్ ఈవీ శ్రేణి. ధర రెండింటిలోనూ నేరుగా సవాలు చేసుకునేలా ఉంటుంది. కాగా హ్యూందాయ్ నుంచి ఇప్పటికే హ్యూందాయ్ ఎక్స్ టర్  ఈవీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ కారు కూడా రానుండటంతో అందరూ దీనిపై మార్కెట్ ఫోకస్ పడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..