కొత్తగా కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 1 లక్ష వరకు తగ్గింపు.!! వివరాలివే.!

Hyundai Special Offers: కొత్తగా కారు కొనాలని ఆలోచిస్తున్నారా.? ఏదైనా ఆఫర్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారా.! అయితే ఇది మీకోసమే...

కొత్తగా కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 1 లక్ష వరకు తగ్గింపు.!! వివరాలివే.!
Hyundai Cars

Updated on: Mar 11, 2021 | 11:25 AM

Hyundai Special Offers: కొత్తగా కారు కొనాలని ఆలోచిస్తున్నారా.? ఏదైనా ఆఫర్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారా.! అయితే ఇది మీకోసమే. ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హ్యుండాయ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. సదరు కంపెనీ ఎంపిక చేసిన పలు మోడళ్లపై సుమారు రూ. 1.5 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. గ్రాండ్ ఐ10 నియోస్, ఎలంట్రా, శాంట్రో, ఆరా, కోనా వంటి మోడళ్లకు ఈ ఆఫర్ వర్తించనుండగా.. మార్చి నెలాఖరు దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని హ్యుండాయ్ కంపెనీ సూచించింది.

మోడళ్ల వారీగా డిస్కౌంట్ ఇలా ఉంది…

హ్యుండాయ్ కోనా మోడల్ – రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు

హ్యుండాయ్ శాంట్రో(ఎంట్రీ లెవెల్) – రూ. 50 వేలు వరకు తగ్గింపు

హ్యుండాయ్ నియోస్ – రూ. 60 వేలు వరకు తగ్గింపు

హ్యుండాయ్ ఆరా – రూ. 70 వేలు వరకు తగ్గింపు

హ్యుండాయ్ ఎలంట్రా – రూ. 1 లక్ష వరకు తగ్గింపు

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!