Telugu News Business How to voluntary surrender PM Kisan Yojana benefits if you are ineligible
PM Kisan Yojana: ఇలాంటి వారు పీఎం కిసాన్ సాయం పొందుతున్నారా..? చర్యలు తప్పవు.. ఉపసంహరించుకోవడం ఎలా..?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఖాతాలో సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ, కొంత మంది తెలిసి తెలియక ఈ పథకంలో చేరారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఖాతాలో సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ, కొంత మంది తెలిసి తెలియక ఈ పథకంలో చేరారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఈ పథకంలో చేరలేని వారి గురించి పోర్టల్‌లో సమాచారం ఇచ్చింది కేంద్రం. అర్హులు ఈ పథకం పొందుతున్నట్లయితే వారు స్వచ్చంధంగా తప్పుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వారిపై చర్యలు తప్పవు.
పథకానికి అనర్హులు
ప్రస్తుతం ఏదైనా రాజ్యాంగ పదవిలో ఉన్నవారు లేదా ఇంతకుముందు అలాంటి పదవిలో ఉన్నవారు ఈ పథకంప్రయోజనాన్ని పొందలేరు.
ఒక రైతు గతంలో లేదా ప్రస్తుతం ఏదైనా రాష్ట్రానికి మంత్రిగా ఉన్నట్లయితే, లేదా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా లేదా మునిసిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా లేదా జిల్లా పంచాయతీకి చైర్‌పర్సన్‌గా ఉంటే, అప్పుడు అతను ఈ పథకానికి అనర్హుడు.
ఒక వ్యక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లేదా గ్రూప్-డిలో సభ్యుడిగా ఉండటమే కాకుండా, ఒక వ్యక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం పనిచేస్తే లేదా గతంలో తన పదవి నుంచి పదవీ విరమణ చేసినట్లయితే అలాంటి వ్యక్తులు ఈ పథఖం పొందలేరు.
ఒక వ్యక్తికి నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ వస్తే, అతను కూడా ఈ పథకానికి అర్హులు కాదు.
ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేరు.
వీటన్నింటితో పాటు, వృత్తిపరంగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు లేదా ఏదైనా ఇతర రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ పోస్ట్‌లో ఉన్న వ్యక్తులు కూడా ఈ పథకం నుంచి లాభం పొందలేరు.
PM కిసాన్ యోజనలో నుంచి తప్పుకోవడం ఎలా..?
ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన కింద వీరిలో ఎవరైనా ప్రయోజనం పొందుతున్నట్లయితే అతను ఈ పథకం నుంచి స్వచ్చంధంగా తప్పుకోవాలి. తప్పుకోవడానికి 5 సులభమైన దశలను అనుసరించాలి.
పీఎం కిసాన్ యోజన pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
దీని తర్వాత ‘ప్రధాన మంత్రి కిసాన్ ప్రయోజనాల స్వచ్ఛంద సరెండర్’పై క్లిక్ చేయండి.
అందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. అలాగే జనరేట్ OTPపై క్లిక్ చేయండి.
మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత మీరు తీసుకున్న అన్ని వాయిదాలు కనిపిస్తాయి.
దీని తర్వాత మీరు ఈ స్కీమ్ ప్రయోజనాన్ని పొందకూడదనుకుంటున్నారా ? సరెండర్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని కోసం మీరు అవునుపై క్లిక్ చేయాలి.
ఈ దశలు పూర్తయిన వెంటనే, ఈ పథకం కోసం మీ తరపున సరెండర్ చేయబడుతుంది. దీనితో పాటు, ప్రభుత్వం తరపున ఇది చేసే వ్యక్తికి సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది.