
ప్రతిరోజూ కేవలం రూ. 100 పెట్టుబడితో కోటి రూపాయల సంపదను సృష్టించడం సాధ్యమేనని బిజినెస్ నిపుణులు వివరించారు. క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక(SIP) ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు. నెలకు రూ. 3,000 చొప్పున లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి, సగటున 13 శాతం వార్షిక రాబడిని ఆశిస్తే, సుమారు 26 నుంచి 27 ఏళ్లలో రూ. 1 కోటి రూపాయల నిధి సమకూరుతుందని లెక్కలతో సహా వివరించారు.
ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
మరింత పెద్ద మొత్తంలో సంపదను సృష్టించాలనుకునే వారి కోసం ప్రత్యేక వ్యూహాన్ని సూచించారు. ప్రతిరోజూ రూ. 100తో ప్రారంభించి, ప్రతి ఏటా పెట్టుబడి మొత్తాన్ని నెలకు మరో రూ. 1,500 (రోజుకు రూ. 50 చొప్పున) పెంచుకుంటూ పోతే, 36 ఏళ్ల కాలంలో రూ. 100 కోట్లు సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఇంత సుదీర్ఘ కాలం పెట్టుబడి పెట్టడం కష్టమనిపించినా, తల్లిదండ్రులు తమ పిల్లల చిన్నతనంలోనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తే, పిల్లలు ఉద్యోగాల్లో చేరే నాటికి అది భారీ సంపదగా మారుతుందని సలహా ఇచ్చారు.
పెట్టుబడుల విషయంలో ఓపిక, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని చెప్పారు. కాంపౌండింగ్ ప్రభావం అనేది 20 ఏళ్ల తర్వాత చాలా వేగంగా పెరుగుతుందని, అది సంపదను ఊహించని స్థాయికి తీసుకెళ్తుందని వివరించారు. మన ఆదాయంలో 20 శాతం భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడిగా మళ్లించి, మిగిలిన మొత్తాన్ని ఖర్చులకు కేటాయించుకోవడం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చని సూచించారు. చిన్న మొత్తాలతో కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే అవకాశాలను సామాన్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..