
చాలామంది జీవితంలో అప్పు అనేది ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. “అప్పు లేనివాడు ఎవడు?” అని మనల్ని మనం సమర్థించుకుంటాం కానీ, ఆ అప్పు మన ప్రశాంతతను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు అది ఒక నిప్పు లాంటిదని గ్రహించాలి. అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారంటే, మీరు తీవ్రమైన ఆర్థిక ప్రమాదంలో ఉన్నారని అర్థం. ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఎంతో విలువైన, ప్రాక్టికల్ పరిష్కారాలను పంచుకున్నారు.
ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..
అప్పుల నుంచి బయటపడాలంటే మొదటి మెట్టు ‘నిజాన్ని అంగీకరించడం’. చాలామంది సమాజంలో తమ పరువు పోతుందని భావించి, ఆస్తులు ఉన్నా వాటిని అమ్మడానికి ఇష్టపడరు. కానీ, ఆస్తి కంటే అప్పు చాలా వేగంగా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. వడ్డీలు కట్టలేక తల్లడిల్లే కంటే, ఉన్న ఆస్తులను అమ్మేసి అప్పులన్నీ తీర్చి ‘జీరో’ స్థాయికి రావడం ఉత్తమం. సున్నా నుంచి జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడం వల్ల కలిగే మానసిక ప్రశాంతత, అప్పుల టెన్షన్‌లో ఉండే కోట్లాది రూపాయల ఆస్తి కంటే మిన్న.
ఇక అప్పులను ఎలా మేనేజ్ చేయాలంటే.. ముందు మీరు ‘డెట్ రీకన్సోలిడేషన్’ గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు, బయట ఎక్కువ వడ్డీకి ఉన్న అప్పులను తీర్చడానికి తక్కువ వడ్డీకి వచ్చే బ్యాంక్ లోన్లు లేదా హోమ్ లోన్ టాప్-అప్‌లను వాడుకోవచ్చు. దీనివల్ల మీపై నెలవారీ భారం తగ్గుతుంది. అలాగే, అప్పులు ఉన్నవారు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్లు చేయకూడదు. 24 శాతం వడ్డీకి అప్పు పెట్టుకుని, 10 శాతం రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లలో పెట్టడం తెలివైన పని కాదు. ముందు అప్పులు తీర్చి, ఆ తర్వాతే పెట్టుబడుల వైపు అడుగులు వేయాలి. ఆర్థిక క్రమశిక్షణతో పాటు సరైన ప్లానింగ్ ఉంటే అప్పుల ఊబి నుంచి ఎవరైనా బయటపడవచ్చు.
ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!