Tech Companies: లాభాల పంట పండించిన షేర్లు.. అసలు నిమిషానికి ఆ కంపెనీలు ఎన్ని కోట్లు ఆర్జిస్తున్నాయో మీరే చూడండి..

|

Feb 21, 2022 | 7:04 AM

Tech Companies: ప్రపంచంలోనే అవి బడా కంపెనీలు. వారికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. మనందరికీ చాలా చేరువగా ఉన్న.. ఈ టెక్ కంపెనీలు కరోనా కొనసాగుతున్నప్పటికీ..

Tech Companies: లాభాల పంట పండించిన షేర్లు.. అసలు నిమిషానికి ఆ కంపెనీలు ఎన్ని కోట్లు ఆర్జిస్తున్నాయో మీరే చూడండి..
Tech Companies
Follow us on

Tech Companies: ప్రపంచంలోనే అవి బడా కంపెనీలు. వారికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. మనందరికీ చాలా చేరువగా ఉన్న.. ఈ టెక్ కంపెనీలు కరోనా కొనసాగుతున్నప్పటికీ తమ వ్యాపారాల్లో దూకుడును మాత్రం తగ్గించడం లేదు. గడచిన ఆర్థిక సంవత్సరం ఎక్కవగా ఆర్జిస్తున్నాయి. ఈ కంపెనీలు అసలు నిమిషానికి ఎంత వ్యాపారం ద్వారా ఎంత ఆదాయాన్ని పొందుతున్నాయి.. అసలు ఒకప్పడు వాటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఇప్పుడు ఎంతకు పెరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు అసలు నిమిషానికి ఎన్ని వేల కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయో గణాంకాలను ఇప్పుడు చూడండి..

విదేశీ కంపెనీల ప్రతి నిమిషం ఆదాయం వివరాలు..

1. అమెజాన్- రూ. 7.91 కోట్లు నిమిషానికి 
2. యాపిల్- రూ. 7.14 కోట్లు నిమిషానికి 
3. గూగుల్- రూ. 4.33 కోట్లు నిమిషానికి 
4. మైక్రోసాప్ట్- రూ. 2.11 కోట్లు నిమిషానికి 
5. ఫేస్ బుక్- రూ. 1.94 కోట్లు నిమిషానికి 
6. టెస్లా- రూ. 1.02 కోట్లు నిమిషానికి 
7. నెట్ ఫ్లిక్స్- రూ. 44 లక్షలు నిమిషానికి 

అదే విధంగా అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఐపీఓలు గా వచ్చినప్పుడు అప్పట్లో 1000 డాలర్లు లేదా మన దేశ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 75 వేలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని మార్కెట్ విలువ ఎంత ఉంటుందో తెలుసుకోండి..

1. మైక్రోసాఫ్ట్- రూ. 22.03 కోట్లు
2. అమెజాన్- రూ. 15.45 కోట్లు
3. యాపిల్- రూ. 12.61 కోట్లు
4. నెట్ ఫ్లిక్స్- రూ. 2.46 కోట్లు
5. టెస్లా- రూ. 1.92 కోట్లు
6. ఫేస్ బుక్- రూ. 4.28 లక్షలు

ఇవీ చదవండి..

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి..ప్రధాన నగరాల్లో నేటి ధరలు

Multibagger Stock: రూ. లక్షను.. రూ. 65 లక్షలు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఎంత ఇచ్చాయంటే..