Aadhaar: ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్‌లను లింక్‌ చేయవచ్చు?

Aadhaar Mobile Numbe Link: ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్య మాత్రమే కాకుండా పేరు, చిరునామా, వయస్సు, లింగం, వేలిముద్రలు, ఐరిస్‌ వంటి ముఖ్యమైన వివరాలు కూడా ఉంటాయి. ఈ ఆధార్ కార్డు ఒక వ్యక్తి భారతీయ పౌరుడని నిర్ధారిస్తుంది. .

Aadhaar: ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్‌లను లింక్‌ చేయవచ్చు?
Aadhaar Card: నేటి కాలంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలను పొందడం నుండి బ్యాంకింగ్ సేవల వరకు ఇది ప్రతిచోటా ఉపయోగం ఉంటుంది. కానీ మీ ఆధార్ కార్డులో ఏదైనా తప్పు ఉంటే, మీరు అనేక ముఖ్యమైన ప్రయోజనాలను కోల్పోవలసి ఉంటుంది. సాధారణంగా ఆధార్‌లో పేరు తప్పు ఉండటం, చిరునామా, సర్‌నేమ్‌, పుట్టిన తేదీ ఇలాంటి తప్పులు ఉన్నట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇందులో ఏ చిన్న పొరపాటు ఉన్న ఈ ప్రయోజనాలు పొందలేరని గుర్తించుకోండి.

Updated on: Sep 22, 2025 | 9:08 PM

Aadhaar Mobile Numbe Link: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) భారతదేశంలోని పౌరులకు ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఈ ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్యలు ఉన్నాయి. ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్య మాత్రమే కాకుండా పేరు, చిరునామా, వయస్సు, లింగం, వేలిముద్రలు, ఐరిస్‌ వంటి ముఖ్యమైన వివరాలు కూడా ఉంటాయి. ఈ ఆధార్ కార్డు ఒక వ్యక్తి భారతీయ పౌరుడని నిర్ధారిస్తుంది. దీని కారణంగా భారతదేశంలో ఆధార్ కార్డును వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: Traffic Rules: మీరు డ్రైవింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే ట్రాఫిక్‌ చలాన్‌ అస్సలు వేయరు!

ఒక మొబైల్ నంబర్‌కు ఒక ఆధార్ కార్డును మాత్రమే లింక్ చేయవచ్చా?

  1. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం.. ఒక మొబైల్ నంబర్‌కు బహుళ ఆధార్ కార్డులను లింక్ చేయడానికి అనుమతి ఉంది. కానీ దానిపై కొన్ని పరిమితులు ఉన్నాయి.
  2. ఒకే కుటుంబ సభ్యులు తమ ఆధార్ కార్డులను ఒకే మొబైల్ నంబర్‌కు లింక్ చేసుకోవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఉదాహరణకు, పిల్లలు తమ ఆధార్ కార్డులను వారి తండ్రి లేదా తల్లి మొబైల్ నంబర్‌కు లింక్ చేయవచ్చు.
  5. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఏ కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డులను ఏ మొబైల్ నంబర్‌కైనా లింక్ చేయవచ్చు.
  6. కుటుంబ సభ్యులు కాని స్నేహితులు సహా ఎవరి ఆధార్ కార్డులను మొబైల్ నంబర్‌కు లింక్ చేయడానికి అనుమతి లేదు.

ఇది కూడా చదవండి: Bike Prices: గుడ్‌న్యూస్‌.. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ బైక్‌లపై భారీ తగ్గింపు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us