House Construction: కేవలం రూ.5 లక్షలకే ట్రిపుల్ బెడ్‌రూం ఇల్లు.. మీరూ సొంతం చేసుకోవచ్చు..

అవును.. ఇది నిజమే. కేవలం రూ.5 లక్షలకే సొంతిల్లు కల సాకారం చేసుకోవచ్చు. సింగిల్ కాదు.. ఏకంగా ట్రిపుల్ బెడ్ రూపం మీ సొంతం చేసుకోవచ్చు. సిమెంట్, ఇటుకలు, ఇసుక ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చు. తుఫాన్లు, భూకంపాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.

House Construction: కేవలం రూ.5 లక్షలకే ట్రిపుల్ బెడ్‌రూం ఇల్లు.. మీరూ సొంతం చేసుకోవచ్చు..
House Construction

Updated on: Nov 17, 2026 | 5:25 PM

నిర్మాణ ఖర్చులు, కూలీల ఖర్చులు పెరిగిపోయిన క్రమంలో సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది సామాన్యులకు పెద్ద పెను భారంగా మారుతోంది. తమకంటూ ఒక కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు అప్పులు చేయాల్సి రావడంతో పాటు అప్పటివరకు కూడబెట్టిన డబ్బులన్నీ ఖర్చు చేయాల్సి వస్తోంది. సిమెంట్, ఇటుకలు, స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగుతున్న క్రమంలో ఇల్లు నిర్మించుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. నిర్మాణ వ్యయం భరించలేక సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే బదులు తక్కువ ధరలో లభించే ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రస్తుత ఆధునిక టెక్నాలజీతో కేవలం రూ.5 లక్షలతో ట్రిపుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇంటి నిర్మాణ సమయంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది.

ఇటుకలు, సిమెంట్ అవసరం లేదు

ప్రస్తుతం ఫ్లై యాష్ మోడల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్‌లో సిమెంట్, ఇటుకలు, ఇసుక, రీబార్ వంటివి ఉపయోగించకుండానే ఇల్లు నిర్మించుకోవచ్చు. సాధారణ ఇటుకలుగా బదులుగా ఫ్లై యాష్‌ ఇటుకలు ఈ నిర్మాణంలో ఉపయోగిస్తారు. టేకులకు బదులు చౌకైన కలప, చెక్కకు బదులు కాంక్రీట్ ఫేములు ఉపయోగిస్తారు. 80 శాతం ఫ్లైయాష్‌తో కూడిన ఇంటర్ లాకింగ్ బ్లాకులను ఉపయోగించి తక్కువ సమయంలో ఇల్లును నిర్మిస్తారు. దీనితో నిర్మించడం వల్ల భూకంపాలు, ప్రకృతి వైఫరీత్యాలు ఎదురైనా ఎలాంటి నష్టం జరగదు.

అసలు ఫ్లై యాష్ ఎలా తయారుచేస్తారు..?

థర్మర్ పవర్ ప్లాంట్లలో బొగ్గును మండించడం ద్వారా సన్నని బూడిద వస్తుంది. దీనిని సున్నం, జిప్సం, ఇసుకతో కలిపి ప్రత్యేక మిశ్రమంగా తయారుచేస్తారు. దీనినే ఫ్లై యాష్ అంటారు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే బ్లాకులు, ప్యానెల్స్ సాంప్రదాయ ఇటుకల కంటే బలంగా ఉంటాయి. ఈ బ్లాకులు, ప్యానెల్స్ ఒకదానికొకటి జత చేసి ఇల్లు నిర్మిస్తారు. ఫ్లై యాష్ ఇటుకలను పుట్టీతో పూసి పెయింట్ వేయవచ్చు. దీని వల్ల ప్లాస్టర్ ఖర్చు కూడా తగ్గుతాయి. ఈ మోడల్‌లో నిర్మించే ఇళ్లకు స్తంభాలు, దూలాలు వంటివి ఉండవు. దీని వల్ల రీబార్ అవసరం ఉండదు.

రూ.5 లక్షలకే సొంతిల్లు

500 చదరపు అడుగుల స్థలంలో కేవలం రూ.5 లక్షల ఖర్చుతో ఈ విధానంలో ఇల్లు నిర్మించుకోవచ్చు. పాలరాయికి బదులుగా సిరామిక్ టైల్స్ ఉపయోగిస్తారు. దీని వల్ల రాతి ఖర్చు రూ.2 వేల వరకు తగ్గుతుంది. ఫ్లై యాష్ ఇటుకల వల్ల ఇసుక ఖర్చు ఉండదు. దీని వల్ల రూ.50 వేలు ఆదా అవుతాయి. ఫ్లై యాష్ ఇటుకల ఖర్చు కవం రూ.25 వేలు మాత్రమే అవుతుంది. సిమెంట్ ఖర్చు దాదాపు రూ.20 వేలు ఆదా అవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us