Honda Car: ఈ హోండా కార్లపై బంపర్‌ ఆఫర్‌.. పండగ సీజన్‌లో రూ.75,000 వరకు తగ్గింపు

|

Oct 14, 2023 | 9:46 PM

హోండా సిటీ మిడ్‌సైజ్ సెడాన్‌పై కంపెనీ మొత్తం రూ.75,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది భారత మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కారు. ప్రారంభించినప్పటి నుండి కూడా ఈ సెడాన్‌పై ఇంత తగ్గింపు ఎన్నడు లేదు. అయితే, ఈ సంవత్సరం హోండా సిటీ అప్‌డేట్ చేయబడింది. అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో కూడిన ఈ మిడ్-సైజ్ సెడాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.63 లక్షల నుండి రూ. 16.11 లక్షల..

Honda Car: ఈ హోండా కార్లపై బంపర్‌ ఆఫర్‌.. పండగ సీజన్‌లో రూ.75,000 వరకు తగ్గింపు
Honda Car
Follow us on

కొత్త కారు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారా..? బడ్జెట్ తక్కువ కాబట్టి వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. మీరు చాలా తక్కువ ధరకు అధిక ధర గల కారును కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే కార్ల కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నాయి. మీరు దసరా పండగకు ముందు కారు కొనాలనుకుంటే, ఆలస్యం చేయకుండా కొనండి. మరి ముందుగా మీకు ఏయే కార్లపై ఆఫర్లు లభిస్తాయో తెలుసుకుందాం. హోండా కార్ ఇండియా తన రెండు స్మార్ట్ సెడాన్‌లు సిటీ, అమేజ్‌పై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇది 10 లక్షల వరకు ధర పరిధిలో మంచి సెడాన్. 10 లక్షల కంటే ఎక్కువ బడ్జెట్‌లో మిడ్-సైజ్ సెడాన్‌లో మీరు కనుగొనే అన్ని ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ముందుగా, అమేజ్, సిటీ ఆఫర్‌లను చూద్దాం.

హోండా సిటీ మిడ్‌సైజ్ సెడాన్‌పై కంపెనీ మొత్తం రూ.75,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది భారత మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కారు. ప్రారంభించినప్పటి నుండి కూడా ఈ సెడాన్‌పై ఇంత తగ్గింపు ఎన్నడు లేదు. అయితే, ఈ సంవత్సరం హోండా సిటీ అప్‌డేట్ చేయబడింది. అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో కూడిన ఈ మిడ్-సైజ్ సెడాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.63 లక్షల నుండి రూ. 16.11 లక్షల వరకు ఉంది. హోండా సిటీ భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా వంటి కొన్ని ప్రముఖ కార్లతో పాటు వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్ వంటి మధ్య-పరిమాణ సెడాన్‌లతో పోటీపడగలదు.

హోండా అమేజ్‌పై ఎంత తగ్గింపు?

ఇవి కూడా చదవండి

ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లో హోండా అమేజ్ తన సముచిత స్థానాన్ని చాటుకుందని చెప్పవచ్చు. కానీ ఈ పండుగ సీజన్‌లో, అమేజ్ అమ్మకాలను పెంచడానికి కంపెనీ కొన్ని వేరియంట్‌లపై రూ.57,000 వరకు తగ్గింపును అందిస్తోంది. హోండా అమేజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.10 లక్షల నుండి రూ.9.86 లక్షల మధ్య ఉంది. ఇది భారత మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ వెన్యూ వంటి ప్రముఖ కార్లతో పోటీపడగలదు. అయితే కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇలాంటి ఆఫర్ల సమయం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరల్లోనే ఆఫర్ల కింద కార్లను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌ తక్కువగా ఉండి మంచి కారు కోసం వెతికే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. అత్యవసరం కాకుండా ఎప్పుడైన కారును కొనుగోలు చేయాలని భావించే వారికి ఇలాంటి పండగ సీజన్‌లోనే కొనుగోలు చేయడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి