హోమ్ లోన్ ఈఎంఐ Vs రెంట్.. రెండింటిలో ఏది బెస్ట్.. ఇవి తెలిస్తే లక్షల్లో ఆదా..

Home Loan EMI Vs Rent: హోమ్ లోన్ ఈఎంఐ అవి ఆస్తిని కూడబెడతాయి అనుకుంటే పొరపాటే! దీర్ఘకాలిక హోమ్ లోన్‌లలో వడ్డీ అసలు కంటే ఎక్కువ ఉంటుంది. రూ.80 లక్షల లోన్ కాస్త 1.7 కోట్లకు చేరుతుంది. ఈఎంఐ ఆర్థిక స్వేచ్ఛను హరించి, కెరీర్ నిర్ణయాలను పరిమితం చేస్తాయి. అద్దె విషయంలోనూ లాభనష్టాలను ఉంటాయి. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం..

హోమ్ లోన్ ఈఎంఐ Vs రెంట్.. రెండింటిలో ఏది బెస్ట్.. ఇవి తెలిస్తే లక్షల్లో ఆదా..
Home Loan Emi Vs Rent

Updated on: Dec 02, 2025 | 2:58 PM

చాలా మందికి సొంతిల్లు అనేది ఓ కల. దాని కోసం జీవితకాలం కష్టపడుతుంటారు. ఇక ప్రస్తుత ఆధునిక యుగంలో చాలా మందిని వేధించే అతిపెద్ద ప్రశ్న..అద్దె చెల్లించాలా లేక హోమ్ లోన్‌తో సొంతింటి కల నెరవేర్చుకుని ఈఎంఐ చెల్లించాలా అని.. సాధారణంగా చాలా మంది ఈఎంఐ ఆస్తిని కూడబెట్టేదని.. అద్దె కేవలం ఖర్చు మాత్రమే అని అనుకుంటారు. ఈ సలహా చాలా సింపుల్‌గా అనిపించినా.. ఈ ఆలోచన వెనుక మధ్యతరగతిని బెదిరించే ప్రమాదాలు, కఠినమైన ఆర్థిక లెక్కలు దాగి ఉన్నాయి.

దీర్ఘకాలిక వడ్డీ భారం

ఈఎంఐ చెల్లించడం అంటే అద్దె చెల్లించడం లాంటిదని ప్రజలు అనుకుంటారు. కానీ లెక్కలు వేరే విషయాన్ని వెల్లడిస్తాయి. దీర్ఘకాలిక హోమ్ లోన్స్‌పై మీరు చెల్లించే వడ్డీ మొత్తం అసలు కంటే ఎక్కువ ఉంటుంది. దీని అర్థం రూ.80-90 లక్షల విలువైన ఇల్లు మీకు చివరికి రూ.1.6-1.7 కోట్లకు చేరుతుంది. ఈ భారీ వ్యత్యాసాన్ని చాలా మంది లోన్ తీసుకున్న కొంత కాలం తర్వాతే గ్రహిస్తారు.

ఆర్థిక స్వేచ్ఛ కోల్పోవడం

ఇల్లు కొనడం వల్ల భారీ ఈఎంఐ భారం, స్వేచ్ఛ కోల్పోవడం కూడా ఉంటుంది. 15-20 సంవత్సరాలు ఒకే ఈఎంఐ చెల్లించి, ఉద్యోగ మార్పు, వేరు ఊరు వెళ్లడం, ఆదాయం తగ్గడం వంటి సవాళ్లు ఉంటాయి. ఈఎంఐ పరిమితులు మీ ఆర్థిక స్వేచ్ఛను హరిస్తాయి. దీనికి విరుద్ధంగా.. అద్దెకు తీసుకోవడం వల్ల మీరు మారడానికి, ఉద్యోగాలు మార్చడానికి, కెరీర్ పరంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛ లభిస్తుంది. ఈఎంఐలు మిమ్మల్ని ఒకే నగరానికి, ఒకే నిర్ణయానికి పరిమితం చేస్తాయి.

వయసు పెరిగే కొద్దీ ఒత్తిడి

కొన్నిసార్లు, మనం వయసు పెరిగే కొద్దీ ఈ ఈఎంఐ ఒత్తిడి మరింత పెరుగుతుంది. అవి ఆర్థికంగా, మానసికంగా భారంగా మారుతాయి. అందుకే నిపుణులు మీ ఇంటి కొనుగోలును చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సలహా ఇస్తారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోతే అద్దెకు తీసుకోవడం అనేది సరైన ఆలోచన అని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈఎంఐ అనేది ప్రజలు పట్టించుకోని లెక్కలు, కానీ ఇది తరువాత మీ ఆర్థిక జీవితానికి అతిపెద్ద దెబ్బ కావచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి