
ఇంటర్నెట్ వినియోగం పెరిగిన ఈ కాలంలో చిన్న వ్యాపారాలు, షాపులు, స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయాల్సిన అవసరం పెరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని డిజిటల్ సర్వీసెస్ ఏజెన్సీని ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి ప్రధాన పెట్టుబడి మీ స్కిల్. సుమారు రూ.40–50 వేల పెట్టుబడితో ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, కొన్ని డిజిటల్ టూల్స్, అలాగే ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్సులకు ఖర్చు చేయవచ్చు. ఈ ఏజెన్సీ ద్వారా సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, వాట్సాప్ మార్కెటింగ్, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సెటప్, పోస్టర్ డిజైన్, చిన్న వెబ్‌సైట్ నిర్వహణ వంటి సేవలను అందించవచ్చు.
ఒక చిన్న వ్యాపారం నుంచి నెలకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఫీజు వసూలు చేయవచ్చు. ప్రారంభంలోనే 8–10 క్లయింట్లు దొరికితే నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఆదాయం సాధ్యమవుతుంది. ఖర్చులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే నిరంతర అప్డేట్ అవుతూ ఉండడం, కస్టమర్లకు ఫలితాలు చూపించడం, సమయానికి పని పూర్తి చేయడం చాలా అవసరం.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా క్లయింట్లను సంపాదించవచ్చు. ఫ్రీగా ఒకటి రెండు ప్రాజెక్టులు చేసి పోర్ట్‌ఫోలియో తయారు చేసుకుంటే నమ్మకం పెరుగుతుంది. తక్కువ పెట్టుబడి, విస్తృత మార్కెట్, ఇంటి నుంచే పని చేసే సౌలభ్యం కారణంగా డిజిటల్ సర్వీసెస్ ఏజెన్సీ భవిష్యత్తులో మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి