స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ.. విలువ ఎక్కువ..

|

Mar 29, 2024 | 6:24 AM

Hero Pleasure Plus Xtec Sports: హీరోమోటో కార్ప్ ఇప్పుడు ఆ హీరో ప్లెజర్ కు కొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది. ఇటీవలే ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్ వేరియంట్‌తో తన స్కూటర్ లైనప్‌ను విస్తరించింది. రూ. 79,738 (ఎక్స్-షోరూమ్) ధరతో దీనిని లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్ స్టైల్, పెర్ఫార్మెన్స్, కనెక్టివిటీ ఫీచర్ల సమ్మేళనం కోసం వెతుకుతున్న రైడర్‌లకు బెస్ట్ చాయిస్ గా ఉంటుంది.

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ.. విలువ ఎక్కువ..
Hero Pleasure Plus Xtec Sports
Follow us on

ద్విచక్ర వాహనాల మార్కెట్లో హీరో మోటోకార్ప్ నుంచి వచ్చే మోడళ్లకు మంచి డిమాండే ఉంటుంది. అది స్కూటర్ అయినా, బైక్ అయినా మంచి సేల్స్ రాబడతాయి. ముఖ్యంగా మహిళలు ఈ కంపెనీ స్కూటర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా హీరో ప్లెజర్ స్కూటర్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో హీరోమోటో కార్ప్ ఇప్పుడు ఆ హీరో ప్లెజర్ కు కొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది. ఇటీవలే ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్ వేరియంట్‌తో తన స్కూటర్ లైనప్‌ను విస్తరించింది. రూ. 79,738 (ఎక్స్-షోరూమ్) ధరతో దీనిని లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్ స్టైల్, పెర్ఫార్మెన్స్, కనెక్టివిటీ ఫీచర్ల సమ్మేళనం కోసం వెతుకుతున్న రైడర్‌లకు బెస్ట్ చాయిస్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, పనితీరు వంటి వివరాలతో పాటు ఇతర వేరియంట్‌ల కన్నా దీనిలో భిన్నంగా ఏమి ఉందో తెలుసుకుందాం..

ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ డిజైన్..

హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ అద్భుతమైన ఆరెంజ్ హైలైట్‌లతో కూడిన వైబ్రెంట్ అబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ కలర్ స్కీమ్‌ను కలిగి ఉంది. స్కూటర్ దాని సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్, ఫ్రంట్ మడ్‌గార్డ్‌పై ’18’ నంబర్‌ను కలిగి ఉంది. ఇది స్కూటర్ రూపానికి స్పోర్టీ టచ్‌ని జోడిస్తుంది. రిమ్స్‌లో ఆరెంజ్ హైలైట్‌లు కూడా ఉన్నాయి. ఇది స్కూటర్ ఓవరాల్ లుక్ ని సుందరంగా కనిపించేలా చేస్తుంది. అదనంగా, మిర్రర్స్, గ్రాబ్ హ్యాండిల్స్ బాడీ కలర్‌లో ఉంటాయి.

ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ ఫీచర్లు, సాంకేతికత..

ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ స్కూటర్ స్పోర్టీ ఎక్స్ టీరియర్ ఉన్నప్పటికీ దీనిలో స్టాండర్డ్ వెర్షన్‌లో ఉన్న కోర్ ఫీచర్లు, టెక్నాలజీని కొనసాగించారు. ఈ స్కూటర్ 10-అంగుళాల చక్రాలు, మెరుగైన స్థిరత్వం కోసం టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, నమ్మకమైన స్టాపింగ్ పవర్ కోసం రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. ఇది రైడర్‌లు ప్రయాణంలో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ ఇంజిన్ సామర్థ్యం..

హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్‌ స్కూటర్లో 110.9సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజన్ 8బీహెచ్పీ, 8.7ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ఇది నగర రోడ్లు, హైవేలపై సాఫీగా అధిక యాక్సెలరేషన్, సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది.

ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ స్పెసిఫికేషన్లు..

ఈ స్కూటర్ 1769ఎంఎం పొడవు, 704ఎంఎం వెడల్పు, 1,161ఎంఎం ఎత్తుతో కూడిన కాంపాక్ట్ ఇంకా ఫంక్షనల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 1238ఎంఎం వీల్‌బేస్,155ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. ఇది పట్టణ ట్రాఫిక్, అసమాన రహదారి ఉపరితలాలను నావిగేట్ చేయడానికి బాగా సరిపోతుంది. ఈ స్కూటర్ 4.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుంది. రైడ్ సమయంలో మంచి పట్టు, స్థిరత్వాన్ని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..