బ్యాంకింగ్ రంగంలో అప్పుడప్పుడు కొన్ని సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్రతి రోజు ఎంతో మంది బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తుంటారు. రకరకాల లావాదేవీలను నిర్వహించేందుకు ముందస్తు ప్లాన్ చేసుకుంటారు. అలాగే టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా బ్యాంకింగ్ రంగం మరింత అభివృద్ధి చెందింది. బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఇంటర్నెట్ సహాయంతో ఎన్నో బ్యాంకు సేవలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు కీలక సమాచారం అందించింది. సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నందున ఈ నెలలో మూడు రోజుల పాటు పలు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నట్లు బ్యాంకు సూచించింది. ఇందు కోసం వినియోగదారులు సహకరించాలని బ్యాంకు కోరింది.
జూన్ 4న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు.
జూన్ 10న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు
జూన్ 18న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు
సిస్టమ్ అప్‌గ్రేట్ కారణంగా పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, డిపాజిట్, డబ్బులు ట్రాన్ఫఫర్ చేయడం, ఇతర లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది.