కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. ప్రకృతి విపత్తులు, కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు రైతులకు మేలుచేసే నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం..పెంచిన ధరల వివరాలను ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
పెరిగిన పంట ధర ప్రతి క్వింటాల్ కు….
1 . వరి – నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53)
2. వరి (గ్రేడ్ ఎ రకం) నూతన ధర రూ.1888
3. జొన్నలు ( హైబ్రీడ్) నూతన ధర రూ. 2,620/- ( పెంచిన ధర రూ.70/-)
4. జొన్నలు ( దేశీయ) నూతన ధర రూ. 2640(పెంచిన ధర రూ.70/-)
5. సజ్జలు నూతన ధర రూ.2150/-( పెంచిన ధర రూ.150/-)
6. మొక్కజొన్నలు నూతన ధర రూ.1,850/-( పెంచిన ధర రూ.90/-)
7 . రాగులు నూతన ధర రూ.3,295/-( పెంచిన ధర రూ. 145)
8. కందులు పెంచిన ధర రూ.6,000/-, ( పెంచిన ధర రూ.200/-)
9. పెసలు పెంచిన ధర రూ.7196/-, (పెంచిన ధర రూ.146)
10. మినుములు పెంచిన ధర రూ. 6,000/-(పెంచిన ధర రూ.300/-)
11. వేరుశనగ నూతన ధర రూ.5275/-( పెంచిన ధర రూ.185/-)
12 . ప్రొద్దుతిరుగుడు నూతన ధర రూ.5885/-( పెంచిన ధర రూ. 235/-)
13. సోయాబిన్ నూతన ధర రూ. 3,880/-( పెంచిన ధర రూ.175/-)
14. నువ్వులు నూతన ధర రూ.6855, ( పెంచిన ధర రూ.370/-)
15. ఒడిసెలు నూతన ధర రూ. 6,695/-(పెంచిన ధర రూ. 755/-)
16. ప్రత్తి(మధ్యరకం) నూతన ధర రూ.5515( పెంచిన ధర రూ.260/-)
17. ప్రత్తి( పొడవు రకం) నూతన ధర రూ.5825(పెంచిన ధర రూ. 275/-)