పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి, అలాగే పసిడిపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే అత్యంత అనుకూలమైన సమయం. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా దేశీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత నెల చివరి వారం నుండి వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు, క్రితం సెషన్‌లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో కుప్పకూలాయి. భారత్‌లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!
Gold Price Today
Image Credit source: freepik

Updated on: Jun 08, 2026 | 7:10 AM

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి బులియన్ మార్కెట్ అద్భుతమైన శుభవార్త అందించింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో క్రితం సెషన్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా రూ.3,000 మేర కుప్పకూలి, ప్రస్తుతం రూ.1,52,720 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,39,990 మార్క్ వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.20,000 తగ్గి, ప్రస్తుతం రూ.2,69,900 వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో బంగారం ధరలు:

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు భారీగా దిగివచ్చాయి. క్రితం రోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.3,000 మేర పడిపోయింది. ప్రస్తుతం ఈ ధరల వద్దే మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రకారం హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,52,720 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులం ప్రస్తుతం రూ.1,39,990 మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

రూ.20 వేలు తగ్గిన వెండి ధర:

బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర కేవలం ఒక్కరోజులోనే ఏకంగా రూ.20,000 మేర క్షీణించింది. అంతకుముందు రెండు రోజుల్లో కూడా రోజుకు రూ.5,000 చొప్పున ధరలు తగ్గుతూ వచ్చాయి. భారీ పతనం తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,69,900 మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ నగరాలు, పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,900, 22 క్యారెట్ల ధర రూ.1,41,990 ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల ధర రూ.1,40140 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,720, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,990 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,720, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,990 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.

కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,720, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,990 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,720, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,990 ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900 ఉంది.

గ్లోబల్ మార్కెట్లో భారీ పతనం:

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తీవ్రంగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 149 డాలర్ల మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,328 డాలర్ల స్థాయికి దిగివచ్చిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా స్పాట్ సిల్వర్ (వెండి) రేటు కూడా ఔన్సుకు 8 శాతం మేర పడిపోయి, ప్రస్తుతం 67.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వాయిదా పడవచ్చనే అంచనాలు, యూఎస్ జాబ్స్ డేటా విడుదల కావడం వంటి అంశాలు గ్లోబల్ మార్కెట్లో ధరల పతనానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.. వీటికి తోడు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ జరిగిన దాడులు, అంతర్జాతీయంగా భారత కరెన్సీ రూపాయి విలువ పుంజుకోవడం వంటి దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

Follow Us