Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై 110 మేర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.58,000 లుగా ఉంది. కిలో వెండిపై రూ. 400 మేర తగ్గింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380గా ఉంది.
వెండి ధరలు ఇలా..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,000గా ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.58,000, చెన్నైలోలో కిలో వెండి ధర రూ.63,300, బెంగళూరులో రూ.63,300, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,300, విజయవాడలో రూ.63,300, విశాఖపట్నంలో రూ.63,300 లుగా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి