Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో గత కొన్నిరోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. వాస్తవానికి మార్కెట్లో (Bullion Market) ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా మంగళవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.49,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380 గా ఉంది. అయితే.. 22 క్యారెట్ల తులం బంగారంపై 300, 24 క్యారెట్లపై 320 మేర పెరిగింది. కాగా.. వెండి ధరలు కిలోకు రూ.800 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.69,900 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలాఉన్నాయంటే..?
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,380, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,470, 24 క్యారెట్ల ధర రూ.55,060 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,380 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,380 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,380 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,380 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,900 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.69,900 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.75,200 ఉంది. బెంగళూరులో రూ.75,200, కేరళలో రూ.75,200 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,200, విజయవాడలో రూ.75,200, విశాఖపట్నంలో రూ.75,200 లుగా కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read: