Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

|

May 07, 2023 | 6:02 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి ఒక్క మహిళ బంగారం అభరణాలపై ఎంతో మక్కువ పెంచుకుంటారు. ధరలు ఎంత పెరిగినా..

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price Today
Follow us on

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి ఒక్క మహిళ బంగారం అభరణాలపై ఎంతో మక్కువ పెంచుకుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల సందర్భాలలో అయితే బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇక గత మూడు,నాలుగు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర.. తాజాగా తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల 10 గ్రామలు ధరపై ఏకంగా రూ.700 వరకు తగ్గగా, అదే 24 క్యారెట్ల బంగారంపై రూ.760 వరకు దిగి వచ్చింది. మహిళలకు అది శుభవార్తేనని చెప్పాలి. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న పసిడి ఒక్కసారిగా తగ్గడం మహిళల్లో ఆనందం కలిగించే అంశమే. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై రూ.550 వరకు తగ్గింది. తాజాగా మే 7వ తేదీని దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు. పెరగవచ్చు. లేదా స్థిరంగా ఉండవచ్చు.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,920 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,090 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,640 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,690 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,640 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.

వెండి ధర:

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.82,400, ముంబైలో రూ.77,700, ఢిల్లీలో రూ.77,700, కోల్‌కతాలో కిలో వెండి రూ.77,700, బెంగళూరులో రూ.82,400, హైదరాబాద్‌లో రూ.82,400, విజయవాడలో రూ.82,400 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి