Gold Prices: అయ్యో.. అనూహ్యంగా పెరిగిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు మళ్లీ నిరాశే.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం ధరలు మళ్లీ హైక్ అవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ధరలు అస్ధిరతతో కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నాయి. ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు.

Gold Prices: అయ్యో.. అనూహ్యంగా పెరిగిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు మళ్లీ నిరాశే.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Pric Hike

Updated on: Nov 27, 2026 | 6:53 AM

బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మొన్నటివరకు పడిపోయిన ధరలు.. మరోసారి ఎగబాకుతున్నాయి. ఒకరోజు తగ్గుతుండగా.. మరో రోజు దూసుకెళ్తున్నాయి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియక కొనుగోలుదారులు అయోమయంలో ఉన్నారు. ఇటీవల ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రేట్లలో భారీ ఒడిదొడుకులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో ధరల్లో అస్థిరత నెలకొంది. దేశంలో కూడా ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరల్లోని మార్పులను కొనుగోలుదారులను కన్‌ప్యూజన్‌కు గురి చేస్తున్నాయి. నవంబర్ 27వ తేదీన శుక్రవారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.

గోల్డ్ రేట్లు ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,810 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,14,410గా కొనసాగుతున్నాయి.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,24,810 పలుకుతుండగా.. 22 క్యారెట్లు రూ.1,14,410కు లభిస్తోంది

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,24,960 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్లు రేటు రూ.1,14,560గా ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,810 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,410గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,810గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,410 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు మాత్రం బంగారంతో పోలిస్తే విభిన్నంగా ఉన్నాయి. సిల్వర్ ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి.

-దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.1,64,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1.65 లక్షలుగా ఉంది

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.1,64,900గా ట్రేడవుతోంది

-చెన్నైలో కిలో వెండి ధర రూ.1,64,900 వద్ద కొనసాగుతోంది

-బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,64,900గా ఉంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us