Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Gold, Silver Price Today: పసిడి ప్రియులకు పండగే.. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు బుధవారం, గురువారం తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా ..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Price Today

Updated on: Jun 16, 2023 | 6:00 AM

Gold, Silver Price Today: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు బుధవారం, గురువారం తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం(జూన్ 16) ఉదయం వరకు నమోదైన బంగారం ధరల ప్రకారం ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ. 54,700 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,670 గా ఉంది. కాగా, కిలో వెండి ధర ఏకంగా రూ.900 మేర తగ్గి రూ.73,100 లుగా కొనసాగుతోంది. ఈ నేపత్యంలో మన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,820 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,670 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670 లుగా కొనసాగుతోంది.

శుక్రవారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.73,100 లుగా ఉంది. అలాగే ముంబైలో కిలో వెండి ధర రూ.73,100, చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500, బెంగళూరులో రూ.74,250, కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.73,100, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500, విజయవాడలో రూ.77,500, విశాఖపట్నంలో రూ.77,500 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us