
Gold Rate Today: ఆషాడ మాసం ప్రారంభం కానుంది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అయితే గత నాలుగైదు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెద్దగా దిగడం లేదు.. పెద్దగా తగ్గడం లేదు. స్వల్ప మార్పులతో కొనసగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది. అయితే నిన్న ఒక్క రోజు బంగారం ధర రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. అదే వెండి ధర రూ.500 వరకు తగ్గింది. తాజాగా జూలై 12 దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..
ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, చెన్నై, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ఇతర నగరాల్లో రూ.2,35,000 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర నిన్న ఒక్క రోజే 5000 రూపాయల వరకు దిగి వచ్చింది.
సాధారణంగా లోకల్ సెంటిమెంట్ ఆధారంగా చూసినట్లయితే బంగారం ధరలు ఆషాడంలో తగ్గుతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఎందుకంటే ఆషాడమాసంలో పెళ్లిళ్లు శుభకార్యాలు జరగవు. ముఖ్యంగా ఆషాడ మాసంలో బంగారు ఆభరణాల షాపింగ్ కూడా చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బంగారు దుకాణాల యాజమాన్యాలు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను కూడా ముందుకు తెస్తుంటాయి. అందుకే ఈ మాసంలో ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
ఆషాడ మాసం జూలై 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఆగస్టు 14వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసినట్లయితే ఆషాడమాసంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ అంచనాల ప్రకారం ఒడిదుడుకులకు లోన అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది పూర్తిగా అంతర్జాతీయ పరిణామాల పైన ఆధారపడి ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆషాడ మాసంలో స్థానికంగా బంగారం సేల్స్ పెంచుకునేందుకు పరిమితమైన రేంజ్ లో ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంటుంది. కనుక ఇది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: iPhone: ఐఫోన్ సైడ్‌కు ఉండే ఆ గీతల వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందా? ఇది డిజైన్ పొరపాటే..!
ఇది కూడా చదవండి: Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.9000 ఆదాయం..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి