Gold Price Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలివే..

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి రేట్లలో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కొసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అయితే, గత కొంత కాలం నుంచి భారీగా బంగారం ధరలు.. కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి.

Gold Price Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలివే..
Gold Price Today

Updated on: Oct 05, 2023 | 6:32 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి రేట్లలో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కొసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అయితే, గత కొంత కాలం నుంచి భారీగా బంగారం ధరలు.. కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం ధర రూ.10 మేర తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,590 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,370 ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ. 300 మేర తగ్గి.. రూ.70,700 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,750 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.57,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370, కోల్‌కతాలో 22 క్యారెట్ల రేటు రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.52,850, 24 క్యారెట్ల ధర రూ.57,650 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,590 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.57,370 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.70,700 లుగా ఉంది. ముంబైలో వెండి ధర రూ.70,700, చెన్నైలో రూ.73,100, బెంగళూరులో రూ.69,000, కేరళలో రూ.73,100, కోల్‌కతాలో రూ.70,700 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.73,100, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.73,100 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us