Gold Price Today: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేటు ఎలా ఉందంటే..

Gold and Silver Latest Prices: బంగారం, వెండికి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. సాధారణంగా పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో పసిడి, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

Gold Price Today: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేటు ఎలా ఉందంటే..
Gold Price Today

Updated on: Sep 17, 2023 | 6:43 AM

Gold and Silver Latest Prices: బంగారం, వెండికి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. సాధారణంగా పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో పసిడి, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,900 లు ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,890 గా ఉంది. అయితే, బంగారంపై శనివారం మాదిరిగానే ఆదివారం కూడా రూ.220 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.700 మేర పెరిగి రూ.74,700 లకు చేరింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..

బంగారం ధరలు..

ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.55,050 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,040 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900, 24 క్యారెట్ల ధర రూ.59,890, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300, 24 క్యారెట్ల ధర రూ.60,320కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,890, కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900, 24 క్యారెట్ల ధర రూ.59,890, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,900, 24 క్యారెట్ల ధర రూ.59,890 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,900 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,890 గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,900, 24 క్యారెట్ల ధర రూ.59,890 కి చేరింది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700 ఉంటే.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,700 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,200, బెంగళూరులో రూ.73,500 లుగా ఉంది. కేరళలో రూ.78,200, కోల్‌కతాలో రూ.74,700 ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.78,200, విజయవాడ, విశాఖపట్నంలో రూ.78,200 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us