
దీపావళి పండుగ వస్తున్న వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ ఊరట కలిగింది. దీపావళికి మరో కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అంతేకాక పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలుకానున్న క్రమంలో చాలామంది పసిడి కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ తరుణంలో పసిడి ధరలు పడిపోతుండటం ఊరట కలిగించే పరిణామంగా చెప్పవచ్చు. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ నవంబర్‌లో జరగనున్న తమ సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లను మరోసారి పెంచే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలవడుతున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలర్ విలువ పెరుగుతుండటం బంగారం ధరల పతనానికి కారణమవుతోంది. అక్టోబర్ 26న సోమవారం ధరలు స్వల్పంగా పడిపోయాయి. వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,570 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,690గా ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,570గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,690 పలుకుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,42,720గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,840కు లభిస్తోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,570గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,690 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,570గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,690 వద్ద ట్రేడవుతోంది.
-ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,570 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,690గా ఉంది.
-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,19,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2.20 లక్షల వద్ద స్థిరపడింది.
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,19,900 వద్ద కొనసాగుతోంది.
-హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.2,19,900గా ఉంది.
-దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,19,900 వద్ద కొనసాగుతోంది.