గోల్డ్ లవర్స్‌కు బిగ్ రిలీఫ్.. సోమవారం బంగారం ధరలు డౌన్.. తులం ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ వారం ప్రారంభమైన సోమవారం కూడా ఊరట కల్గించాయి. నవంబర్ 23వ తేదీన కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. వారం ప్రారంభంలోనే ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పతనమయ్యాయి.

గోల్డ్ లవర్స్‌కు బిగ్ రిలీఫ్.. సోమవారం బంగారం ధరలు డౌన్.. తులం ఎంతంటే..
Gold Prices

Updated on: Nov 23, 2026 | 6:37 AM

బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత కొద్ది కాలంగా ధరలు పతనమవుతుండగా.. ఈ వారం ప్రారంభం నవంబర్ 23న సోమవారం కూడా అదే బాటలో నడిచాయి. సోమవారం కూడా ధరలు భారీగా కుప్పకూలాయి. అమెరికా డాలర్ బలపడటం బంగారం ధరలు డౌన్ అవ్వడానికి ఒక కారణం కాగా.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న అంచనాలు ధరల పెరుగుదలకు పెద్ద కారణంగా నిలుస్తోంది. డిసెంబర్‌లో జరగనున్న సమీక్షా సమావేశంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచితే పసిడి ధరలు మరింత క్రాష్ అవ్వనున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పడిపోతున్నాయి. నవంబర్ 23న బంగారం, వెండి ధరలు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇవాల్టీ బంగారం ధరలివే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,070 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,14,640 వద్ద లభిస్తున్నాయి.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,25,070 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,640 పలుకుతుంది

-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ..1,25,070గా కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,14,640గా ఉంది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ..1,25,070 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,640 వద్ద ట్రేడవుతోంది

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,220 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.రూ.1,14,790కు లభిస్తోంది

సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

-హైదరాబాద్‌లో ఆదివారం కిలో వెండి ధర రూ.1.75 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.1,74,900 వద్ద కొనసాగుతోంది

-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.1.75 లక్షలు వద్ద కొనసాగుతోంది

-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.1.75 లక్షలు వద్ద ట్రేడవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us