Gold Price : పసిడి ప్రియులకు ఊరట.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు..! ఇవాళ్టి ధరలు ఇవే..

Gold Price : సామాన్యులకు శుభవార్త..! గత కొన్ని రోజులుగా సామాన్యులకి చుక్కలు చూపిస్తున్న పసిడి పరుగులకు కాస్త కళ్లెం పడినట్లుగా ఉంది.. బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో బంగారం ధరలు తగ్గాయి. యుద్ధ ప్రభావాలు కాకుండా ప్రపంచ మార్కెట్ సహజ ప్రవర్తన ధరల తగ్గుదలకు కారణం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది గొప్ప గుడ్ న్యూస్ అంటున్నారు నిపుణులు.. ఎందుకంటే నేడు బంగారం ధర భారీగా తగ్గింది. ఈ రోజు తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయి? దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం....

Gold Price : పసిడి ప్రియులకు ఊరట.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు..! ఇవాళ్టి ధరలు ఇవే..
Gold

Updated on: May 10, 2025 | 7:08 AM

దేశంలో ఈ రోజు (శనివారం మే10న) 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,834లుగా ఉంది. అది 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,014లుగా ఉంది. అటు18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.7,375లుగా పలుకుతోంది. ఇకపోతే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

– ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,290, 24 క్యారెట్ల ధర రూ.98,490 గా ఉంది.

ఇవి కూడా చదవండి

– ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340 గా ఉంది.

– చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.90,140, 24 క్యారెట్ల రేటు రూ.98,340 గా ఉంది.

– బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340 గా ఉంది.

– హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340 గా ఉంది.

– విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.99,010 గా ఉంది.

– విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340 గా ఉంది.

వెండి ధరలు..

ఇక ఇవాళ్టి వెండి ధరల విషయానికి వస్తే.. పసిడితో పాటే వెండి ధర కూడా దిగొచ్చింది. గ్రాము 110.90లు ఉండా, కిలో వెండి ధర రూ.1,10,900లుగా పలుకుతోంది.

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,10,900

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,11,100

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.98,900

ముంబైలో రూ.98,900

బెంగళూరులో రూ.98,900

చెన్నైలో రూ.1,10,900 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us