
Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కి, మార్కెట్ అనిశ్చితుల్లో పెట్టుబడులు కాపాడుకోవడానికి కూడా గోల్డ్ వైపే చూస్తారు. ఈ డిమాండ్‌ని తీర్చడానికి భారత్ ఎక్కువ శాతం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇందుకు ప్రతి సంవత్సరం చాలా ఖర్చు అవుతోంది. కొంత కాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ ధరల రికార్డులు బద్ధలవుతూ పోతున్నాయి. దీంతో స్వదేశంలో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర పెరిగింది. తాజాగా అక్టోబర్ 4న దేశంలో తులం బంగారం ధర రూ.1,18,520కి చేరుకుంది.
ఇది కూడా చదవండి: BSNL: బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌ల గురించి తెలిస్తే పరుగెత్తుకుంటూ సిమ్ తీసుకుంటారు!
ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగారం తో పాటు వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. వెండి ధర చరిత్రలో ఎన్నడు లేని విధంగా కిలో వెండి ధర 1.50 లక్షల రూపాయలు దాటేసింది. శనివారం కిలో వెండి ధర రూ.రూ.151,900 వద్ద ఉంది. ఇక హైదరాబాద్, కేరళ, చెన్నై ప్రాంతాల్లో అయితే మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,61,900 ఉంది. ముఖ్యంగా సిల్వర్ ఎక్కువగా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో వాడుకుంటున్న నేపథ్యంలో భారీగా డిమాండ్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ, సెమీ కండక్టర్ల తయారీలోనూ వెండిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ కారణంగా కూడా వెండి ధర భారీగా పెరిగింది అని చెప్పవచ్చు. దీనికి తోడు వెండి లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇది కూడా వెండి ధరను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి