
బంగారం ధరలో పెరుగుదల ఆగే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ప్రతి కొత్త రోజుతో బంగారం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ రోజు కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. శుక్రవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డాలర్ పతనం, యుఎస్-చైనా వాణిజ్య యుద్ధ భయాలు, దేశీయ స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతుతో MCX గోల్డ్ ఏప్రిల్ 4 కాంట్రాక్ట్ మొదటిసారిగా రూ. 84,000 స్థాయిని దాటింది. అయితే ప్రస్తుతం మాత్రం తులం బంగారం ధర రూ.86 వేలదాటేసింది. ఫిబ్రవరి 7వ తేదీన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,520 ఉంది. శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
పెరుగుతున్న వాణిజ్య యుద్ధ ముప్పు: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం పెరుగుతుందనే భయం కారణంగా పెట్టుబడిదారులు మరోసారి బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీని కారణంగా బంగారం ధర పెరుగుతోంది.
బంగారం ధరలు ఎంతకాలం ఇలాగే ఉంటాయి?
రాబోయే US ఆర్థిక డేటా కారణంగా ధరల హెచ్చుతగ్గులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ప్రపంచ అనిశ్చితి, కేంద్ర బ్యాంకు కొనుగోళ్ల కారణంగా బంగారం దాని పెరుగుదల ధోరణిని కొనసాగించవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే, స్వల్పకాలంలో దిద్దుబాటు కనిపించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి