దేశంలో బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. అయితే రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ ప్రస్తుతం స్వల్పంగా తగ్గింది. కానీ వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. మార్చి 26న దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 61,240 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర 66,810 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా తులం బంగారంపై అతి స్వల్పంగా అంటే పది రూపాయలు మాత్రమే తగ్గింది. మంగళవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నయి.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,700. అదే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,390 ఉండగా, 24 క్యారెట్ల 66,960 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.66,810 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.66,810 ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.77,900 ఉంది. అయితే చాలా రాష్ట్రాల్లో మాత్రం వెండి ధర కిలోకు 80వేలకుపైగా దాటేసింది.
బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
బంగారం ధర ఈ పెరుగుదల వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. కేడియా కమోడిటీస్ ప్రెసిడెంట్ అజయ్ కేడియా మాట్లాడుతూ.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న మాంద్యం భయమే బంగారం ధరల పెరుగుదలకు అతిపెద్ద కారణమని అన్నారు. ఇది కాకుండా, షాపింగ్, పెళ్లిళ్ల సీజన్‌లో సెంట్రల్ బ్యాంకులకు కూడా భారీ డిమాండ్ ఉంది.
ఇండియన్ బులియన్ అండ్ జ్యూలరీ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం, బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నెలలో చాలా సార్లు బంగారం కొత్త శిఖరాన్ని తాకింది. మార్చి 11న కూడా కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. మార్చి 5న కూడా ఈ నెల ఆల్‌టైమ్ హై రూ.64598కి చేరుకుంది. ఆ తర్వాత రెండు రోజుల్లో అంటే మార్చి 7న చరిత్ర సృష్టించి రూ.65049కి చేరింది. మార్చి 11న జీఎస్టీ లేకుండానే 10 గ్రాముల బంగారం ధర రూ.65646గా మారడంతో ఈ రికార్డు బద్దలైంది. ఇలా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది పసిడి. అయితే ప్రస్తుతం స్వల్పంగా తగ్గుముఖం పట్టినా.. ఇంకా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.
మార్కెట్‌లో బంగారం డిమాండ్, సరఫరా ఆధారంగా బంగారం ధర ఎక్కువగా నిర్ణయిస్తారు. బంగారం డిమాండ్ పెరిగితే రేటు కూడా పెరుగుతుంది. బంగారం సరఫరా పెరిగితే ధర తగ్గుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా బంగారం ధర ప్రభావితమవుతుంది. ఉదాహరణకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పేలవంగా పనిచేస్తుంటే, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా బంగారం వైపు చూస్తారు. దీంతో బంగారం ధర పెరుగుతుంది .
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి