
Gold Price Today: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. తాజాగా అక్టోబర్ 2న దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం బంగారం కొనాలంటే ఏకంగా లక్ష 20 వేల రూపాయల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తులం బంగారం ధర 1లక్ష 19 వేల 250 రూపాయలు ఉంది. అదే వెండి కిలో ధర 1 లక్ష 50 వేల 900 రూపాయల వద్ద ఉండగా, అదే హైదరాబాద్, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర 1 లక్ష 60 వేల రూపాయల వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Divorce in India: భరణం కోసం భారీగా అప్పులు.. బాబోయ్ పెళ్లంటేనే భయపడుతున్న మగాళ్లు.. సర్వేలో షాకింగ్ విషయాలు
బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు మరియు ఫలితంగా, వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.