
Gold, Silver Prices Today: బంగారం కొనేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇటీవల గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో శని, శుక్రవారాల్లోనూ ధర భారీగా పెరిగింది. అయితే, ఇవాళ మాత్రం గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే గత రెండు రోజుల్లో సుమారు వెయ్యి రూపాయల వరకు దిగి వచ్చింది.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. అయితే, బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి నాటికి బంగారం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, 10 గ్రాములకు రూ.1.80 లక్షలను దాటవచ్చని కూడా వారు పేర్కొంటున్నారు.
తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 22) దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు.
ఇది కూడా చదవండి: DMart: డీమార్ట్‌లో ఈ వస్తువులు కొంటే డబ్బు ఆదా.. MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
వారంలోని మొదటి ట్రేడింగ్ రోజు అయిన సోమవారం, సెప్టెంబర్ 21న, అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం, వెండి రెండింటి ధరలు తగ్గాయి. కామెక్స్ డేటా ప్రకారం, బంగారం ధర 0.53% తగ్గి (కామెక్స్‌లో బంగారం ధర) ఔన్సుకు $4401.30కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధరలు 0.48% తగ్గి ఔన్సుకు $66.825 వద్ద ట్రేడ్ ట్రేడయ్యాయి.
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి. MCX ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.53 లక్షలకు పడిపోగా, కిలోగ్రాము వెండి ధర సుమారు రూ.2.40 లక్షలకు తగ్గింది.
ఇది కూడా చదవండి: UPI Payments: పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్? యజమానుల సంచలన నిర్ణయం!
ఇది కూడా చదవండి: Portable AC: అద్దె ఇంట్లో ఉంటున్నారా? గోడతో పనిలేకుండా చల్లటి గాలినిచ్చే పోర్టబుల్ ఏసీలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి