Gold Price Today: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. గత నాలుగు రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు సోమవారం నాడు తగ్గాయి. దీంతో వినియోగదారులకు బిగ్ రిలీప్ ఇచ్చాయి. అయితే, ఆదివారంనాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,350లుగా నమోదైంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,840గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఆదివారం కిలో వెండి ధర రూ. 92,600గా ఉంది. నేడు అంటే, సోమవారం నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,340లుగా నమోదైంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,830గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఆదివారం కిలో వెండి ధర రూ. 92,500గా నమోదైంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.71,340 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.77,830 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. అటు దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,490 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,849గా ఉంది.
వెండి ధరలు విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి రూ. 99,800 ఉండగా.. ముంబైలో రూ. 92,500లు కాగా, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 92,300గా నమోదైంది. ఇక మీరు తాజాగా నమోదైన బంగారం ధరలను తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..