Gold Price Today: మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ప్రతిరోజూ కనిపిస్తుంటాయి. ఇక గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన బంగారం, వెండి ధర.. గత మూడు రోజులుగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా శనివారం దేశంలో నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold Price Today: మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold And Silver Price

Updated on: Dec 28, 2024 | 6:25 AM

Gold Price Today: ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర.. గత రెండు రోజులుగా పెరుగుతూ షాక్ ఇస్తోంది. నిన్న అంటే, శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,260 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,740గా ఉంది. ఇక నేడు శనివారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,510లకు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 78,010గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. వాటి ధరలు సైతం పెరిగాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ. 91,700గా ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.71,510 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.78,010గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. అటు దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల పసిడి ధర రూ.71660 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,160గా ఉంది.

వెండి ధరలు విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి రూ. 99,900 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 92,400గా నమోదైంది. ఇక మీరు తాజాగా నమోదైన బంగారం ధరలను తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us