Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..

పసిడి కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి బంగారం ధరలు. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈ వారం రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పెరుగుదల కనిపించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా బంగారం కొనేందుకు లేదా వాటిపై పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. కేంద్రప్రభుత్వం సావరిన్ గోల్డ్ పేరుతో ప్రత్యేక స్కీమ్స్ కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలుదారులను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..
Gold, Silver Price

Updated on: May 11, 2024 | 6:05 AM

పసిడి కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి బంగారం ధరలు. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈ వారం రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పెరుగుదల కనిపించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా బంగారం కొనేందుకు లేదా వాటిపై పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. కేంద్రప్రభుత్వం సావరిన్ గోల్డ్ పేరుతో ప్రత్యేక స్కీమ్స్ కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలుదారులను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పాడిన ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డుపరిస్థితులే అని అంటున్నారు నిపుణులు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 73,700గా ఉంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు రూ. 67,560కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 పెరిగింది. ఇక కిలో వెండి ధర కూడా రూ. 91,300గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.100 పెరిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.

24 క్యారెట్ల బంగారం ధర రూ.

హైదరాబాద్ – రూ. 73,700
విజయవాడ – రూ. 73,700
విశాఖపట్నం – రూ. 73,700
బెంగళూరు – రూ. 73,700
ముంబై – రూ. 73,700
చెన్నై – రూ. 73,860

22 క్యారెట్ల పసిడి ధర రూ.

హైదరాబాద్ – రూ. 67,560
విజయవాడ – రూ. 67,560
విశాఖపట్నం – రూ. 67,560
బెంగళూరు – రూ. 67,560
ముంబై – రూ. 67,560
చెన్నై – రూ. 67,710

ఇవి కూడా చదవండి

కిలో వెండి ధర రూ.

హైదరాబాద్ – రూ. 91,300
విజయవాడ – రూ. 91,300
విశాఖపట్నం – రూ. 91,300
ముంబై – రూ. 91,300
చెన్నై – రూ. 91,300
బెంగళూరు – రూ. 87,100

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us