Gold Price: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం బంగారం ఎంతంటే..

|

Jan 11, 2024 | 6:05 AM

కొత్త ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది చివర్లో విపరీతంగా పెరిగి పసిడి కొనుగోలు చేసే వారికి బెంబేలెత్తించినప్పటికీ ఈ మధ్య కాలంలో స్థిరంగా కొనసాగడం శుభ పరిణామమనే చెప్పాలి. ఈరోజు ధరలు పెరుగకపోవడం కాస్త ఊరట కల్గించే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా బంగారం ధరలు పెరుగు,తగ్గుదలకు అంతర్జాతీయంగా డాలర్ విలువ ప్రదాన కారణం. ఇది ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.

Gold Price: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం బంగారం ఎంతంటే..
Gold Price Today
Follow us on

కొత్త ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది చివర్లో విపరీతంగా పెరిగి పసిడి కొనుగోలు చేసే వారికి బెంబేలెత్తించినప్పటికీ ఈ మధ్య కాలంలో స్థిరంగా కొనసాగడం శుభ పరిణామమనే చెప్పాలి. ఈరోజు ధరలు పెరుగకపోవడం కాస్త ఊరట కల్గించే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా బంగారం ధరలు పెరుగు,తగ్గుదలకు అంతర్జాతీయంగా డాలర్ విలువ ప్రదాన కారణం. ఇది ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరలు స్థిరంగా కొనసాగేందుకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 62,950 కాగా ఈరోజు కూడా రూ. 62,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,700 ఉండగా ఈరోజు రూ.57,700 గా కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటికి ఈరోజుటికి పెద్ద మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్‎లో కిలో వెండి నిన్న రూ. 78,000 ఉండగా.. ఈరోజు కిలోపై రూ. 500 తగ్గి 77,500 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 62,950
  • విజయవాడ..రూ. 62,950
  • ముంబాయి..రూ. 62,950
  • బెంగళూరు..రూ. 62,950
  • చెన్నై..రూ. 63,490

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 57,700
  • విజయవాడ..రూ. 57,700
  • ముంబాయి..రూ. 57,700
  • బెంగళూరు..రూ. 57,700
  • చెన్నై..రూ.58,200

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 77,500
  • విజయవాడ..రూ. 77,500
  • చెన్నై..రూ. 77,500
  • ముంబాయి..రూ. 76,000
  • బెంగళూరు..రూ. 73,500

మరిన్ని బిజినెస్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..