Gold Loan vs Home Loan: రెపో రేటు మళ్లీ మారలేదు.. లోన్ తీసుకునే వారికి ఇదే బెస్ట్ చాయిస్..

|

Oct 09, 2024 | 5:47 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను వరుసగా పదకొండవ సారి మార్చకుండా కొనసాగించింది. రెపో మార్కెట్ రేట్లు 6.5 శాతంగా నిర్ణయించింది. ఈ సమయంలో మరి హోమ్ లోన్ , గోల్డ్ లోన్ రేట్లు ఎలా ఉంటాయన్న ఆలోచన అందరి మదిలో మెదులుతోంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ కూడా ఆలోచిస్తున్నారు. సాధారణంగా గృహ రుణాలు సురక్షితమైనవి, ఎక్కువ వ్యవధిని కలిగి ఉంటాయి కాబట్టి, అవి తరచుగా 8.5% నుంచి 9.5% వరకు వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి.

Gold Loan vs Home Loan: రెపో రేటు మళ్లీ మారలేదు.. లోన్ తీసుకునే వారికి ఇదే బెస్ట్ చాయిస్..
Loans
Follow us on

మార్కెట్లో సెక్యూర్ లోన్లంటే రెండే. అవి హోమ్ లోన్, గోల్డ్ లోన్. ఈ రెండింటిలోనూ వడ్డీ రేట్లు ఇతర రుణాలతో పోల్చితే తక్కువగా ఉంటాయి. పైగా అధిక మొత్తంలో లోన్లు అందించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకొస్తాయి. అయితే వీటి వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించే రెపో రేటు ఆధారంగా మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను వరుసగా పదకొండవ సారి మార్చకుండా కొనసాగించింది. రెపో మార్కెట్ రేట్లు 6.5 శాతంగా నిర్ణయించింది. ఈ సమయంలో మరి హోమ్ లోన్ , గోల్డ్ లోన్ రేట్లు ఎలా ఉంటాయన్న ఆలోచన అందరి మదిలో మెదులుతోంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ కూడా ఆలోచిస్తున్నారు. సాధారణంగా గృహ రుణాలు సురక్షితమైనవి, ఎక్కువ వ్యవధిని కలిగి ఉంటాయి కాబట్టి, అవి తరచుగా 8.5% నుంచి 9.5% వరకు వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి. బంగారంపై రుణాలు తక్కువ అర్హత అవసరాలు, తక్కువ ప్రాసెసింగ్ సమయాలను కలిగి ఉంటాయి. అయితే వీటిపై 8-15% వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే ఆర్బీఐ అక్టోబర్ 9న ప్రకటించిన రెపో రేటు ఆధారంగా ఈ రెండు రుణ ఎంపికలలో ఏది బెస్ట్ అంటే ఏం చెబుతారా? మీరు మంచి నిర్ణయం తీసుకోవాలంటే నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలు తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పోలిక కష్టం..

సాధారణంగా గోల్డ్ లోన్, హోమ్ లోన్ మధ్య పోలిక కష్టతరంగా ఉంటుంది. పైగా రెపో రేటు 6.5శాతం వద్ద స్థిరంగా ఉంచినందున ఇది మరింత క్లిష్టంగా మారింది. అయితే ఈరెండూ రుణ ఎంపికలు దాని ప్రయోజనాలు, నష్టాలు కలిగి ఉంటాయి. సాధారణంగా దీర్ఘకాలిక ఆర్థిక కట్టుబాట్లకు గృహ రుణాలు చౌకగా ఉంటాయి. మరోవైపు, అత్యవసర స్వల్పకాలిక రుణ అవసరాలకు బంగారు రుణాలు బెస్ట్ చాయిస్ గా నిలుస్తాయి. కొంతమంది కొనుగోలుదారులు రుణం పదవీకాలం, అర్హత, లోన్ ఆరిజినేషన్ ఖర్చులు, ముందస్తు ముగింపు మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మరో వైపు అసలు రెపో రేటు స్థిరంగా ఉంచిన సందర్భంలో ఇప్పుడు రుణాన్ని ఎంచుకోవడానికి సరైనదేనా? అంటే చాలా మంది గృహ రుణానికి బదులుగా బంగారు రుణం తీసుకోవాలని భావించే భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.

  • మీకు అత్యవసరంగా రుణం అవసరం అయితే.. వేగంగా మంజూరు కావాలనుకుంటే మీకు బంగారంపై రుణం సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో బ్యాంకులు నిమిషాల్లోనే రుణాలను మంజూరు చేస్తుంది. పైగా దీనికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు. మన బంగారం తీసుకుని దానికి వచ్చే మొత్తం రుణంగా అందిస్తారు.
  • అదే సమయంలో గృహ రుణాలకు కాస్త సమయం పడుతుంది. కొన్ని పత్రాలు అవసరం అవుతాయి. రుణగ్రహీత రుణం ఎందుకు పొందాలనుకుంటున్నారు అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఇంటికి ఫైనాన్స్ చేయాలనుకునే సందర్భంలో, గృహ రుణాలు ఉత్తమమైనవి.
  • చవకైనా ఎంపిక కావాలనుకుంటే మాత్రం మీకు గృహ రుణాలు బెస్ట్ ఎంపికగా ఉంటాయి. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5శాత వద్ద ఉంచిన నేపథ్యంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.5 నుండి 9.5 వరకు ఉంటాయి. మరోవైపు బంగారంపై వడ్డీ రేటు ఏడాదికి 10 నుండి 15 శాతం వరకు ఉంటుంది.
  • క్రెడిట్ స్కోర్ కూడా గృహ రుణ మంజూరులో అవసరం అవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రుణం చవకగా, సులభంగా మంజూరవుతుంది. బంగారంపై రుణాలకు క్రెడిట్ స్కోర్ తో పనిలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..