Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్షా 60 వేల మార్క్ దాటి పరుగులు పెడుతోంది.. ఇటీవల మరింత పెరిగిన ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి..

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
Gold Price

Updated on: Mar 08, 2026 | 6:29 AM

పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్షా 60 వేల మార్క్ దాటి పరుగులు పెడుతోంది.. ఇటీవల మరింత పెరిగిన ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. ఆదివారం గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. ఆదివారం (మార్చి 8, 2026) ఉదయం 6గంటల వరకు.. నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,63,640 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర 1,50,000 గా ఉంది.

వెండి కిలో ధర 2,85,000 గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,640, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,50,000 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,000 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,63,640, 22 క్యారెట్ల ధర రూ.1,50,000 ఉంది. కిలో వెండి ధర రూ.2,90,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,63,800, 22 క్యారెట్ల ధర రూ.1,50,150 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,85,000 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,63,640, 22 క్యారెట్ల ధర రూ.1,50,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,85,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,64,180, 22 క్యారెట్ల ధర రూ.1,50,500 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us