
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని.. పేర్కొంటున్నారు నిపుణులు.. ఇటీవల ధరలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ.. మళ్లీ పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.. సోమవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 2450 మేర పెరిగి.. రూ.1,51,530కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ. 2250 మేర పెరిగింది. వెండి దాదాపు రూ.10 వేల వరకు పెరిగింది. కాగా.. మంగళవారం కూడా ధరల్లో మార్పులు కనిపించనున్నాయి. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. మంగళవారం (జూన్ 16, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి.. రూ.1,51,540 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 పెరిగి.. రూ.1,38,910 గా ఉంది.
వెండి కిలోపై రూ.100 మేర పెరిగి.. రూ.2,65,100 గా ఉంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..