
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. ప్రతిరోజు గోల్డ్, సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే.. అయితే.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అలాగే పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. క్రమంలోనే.. బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. 10 రోజుల్లో బంగారం 10 గ్రాములపై రూ.6వేలు, అలాగే వెండి కిలోపై రూ.10వేల వరకు ధరలు తగ్గాయి.. గురువారం గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. జులై 2, 2026 ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ. 10 మేర తగ్గి.. రూ.1,40,770 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి.. రూ.1,29,040 గా ఉంది.
వెండి కిలో ధర రూ.2,40,100 లు గా ఉంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..